సెప్టెంబర్ 07 పున్నమి ప్రతినిధి @
ప్రపంచవ్యాప్తంగా ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. వాతావరణం అనుకూలిస్తే ప్రపంచంలోని దాదాపు 85 శాతం మందికి ఇది కనిపించనుంది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం కనిపిస్తుంది. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పాక్షికంగా కనిపించనుంది. చంద్రుడు 82 నిమిషాలపాటు పూర్తిగా భూమి నీడన ఉండనున్నాడు.
ఆదివారం రాత్రి 8.58 గంటలకు గ్రహణం ప్రారంభం కానుంది. 11 గంటల నుంచి 12.22 వరకు సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. సోమవారం తెల్లవారుజామున 2.25 గంటలకు గ్రహణం వీడనుంది.
మేఘాలు లేకుంటే దిల్లీ, ముంబయి, కోల్‌కతా, పుణె, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో సంపూర్ణ చంద్ర గ్రహణం కనిపించనుంది.

నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం
సెప్టెంబర్ 07 పున్నమి ప్రతినిధి @ ప్రపంచవ్యాప్తంగా ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. వాతావరణం అనుకూలిస్తే ప్రపంచంలోని దాదాపు 85 శాతం మందికి ఇది కనిపించనుంది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం కనిపిస్తుంది. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పాక్షికంగా కనిపించనుంది. చంద్రుడు 82 నిమిషాలపాటు పూర్తిగా భూమి నీడన ఉండనున్నాడు. ఆదివారం రాత్రి 8.58 గంటలకు గ్రహణం ప్రారంభం కానుంది. 11 గంటల నుంచి 12.22 వరకు సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. సోమవారం తెల్లవారుజామున 2.25 గంటలకు గ్రహణం వీడనుంది. మేఘాలు లేకుంటే దిల్లీ, ముంబయి, కోల్‌కతా, పుణె, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో సంపూర్ణ చంద్ర గ్రహణం కనిపించనుంది.

