శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల సమస్యలను నేరుగా వినేందుకు, వాటి పరిష్కారానికై ప్రత్యేకంగా ప్రజాదర్బార్ ఏర్పాటు చేయబడింది. శుక్రవారం నాడు ఉదయం 9:00 గంటలకు రేణిగుంట పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని ఈ ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కార మార్గాలు చూపడం లక్ష్యంగా ఈ దర్బార్‌ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుదీర్ రెడ్డి వెల్లడించారు. ప్రజల వద్దకు అధికారులు, ప్రజాప్రతినిధులు చేరే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తోందని అయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని, తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి బొజ్జల సుధీర్ రెడ్డి చేపడుతున్న ఈ కార్యక్రమం స్థానికంగా ప్రజాదరణ పొందుతుంది.

నేడు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే బొజ్జల ప్రజాదర్బార్