Thursday, 5 February 2026
  • Home  
  • *నేడు డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి*
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*నేడు డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి*

*నేడు డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి* *తిరుపతి, నవంబర్ 2:* ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంస్థలో మొట్టమొదటిసారిగా డయల్ యువర్ సీఎండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైయస్సార్ కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేయడం ద్వారా తమ విద్యుత్ సమస్యలను నేరుగా సిఎండి దృష్టికి తీసుకువచ్చి, వాటిని పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10:00 నుంచి 12:00 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనికోరారు. వినియోగదారులు మొబైల్ నంబరు: 9133331912కు చాట్ చేయడం ద్వారా కూడా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని ఆ ప్రకటనలో తెలిపారు.

*నేడు డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి*

*తిరుపతి, నవంబర్ 2:* ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంస్థలో మొట్టమొదటిసారిగా డయల్ యువర్ సీఎండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైయస్సార్ కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేయడం ద్వారా తమ విద్యుత్ సమస్యలను నేరుగా సిఎండి దృష్టికి తీసుకువచ్చి, వాటిని పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10:00 నుంచి 12:00 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనికోరారు. వినియోగదారులు మొబైల్ నంబరు: 9133331912కు చాట్ చేయడం ద్వారా కూడా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని ఆ ప్రకటనలో తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.