Thursday, 5 February 2026
  • Home  
  • నేడు చిట్వేల్‌లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0
- అన్నమయ్య

నేడు చిట్వేల్‌లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0

-ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా నిర్వహించాలి: ఎంఈఓలు ఖాజా మొహిద్దీన్, ఈశ్వరయ్య చిట్వేల్, డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చిట్వేల్ మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో కూడా శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0ను తప్పనిసరిగా నిర్వహించాలని మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈఓలు) ఖాజా మొహిద్దీన్ మరియు ఈశ్వరయ్య లు తెలియజేశారు. -సక్రమ నిర్వహణకు ఆదేశాలు ప్రభుత్వం జారీ చేసిన షెడ్యూల్ మరియు నియమ నిబంధనల ప్రకారం ఈ సమావేశాలను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యాలపై ఉందని ఎంఈఓలు స్పష్టం చేశారు.ఈ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థి ప్రగతి, పాఠశాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు, విద్యా ప్రమాణాల మెరుగుదల వంటి అంశాలపై చర్చించనున్నారు.మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ ముఖ్యమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దీనికి సంబంధించిన నివేదికను మండల విద్యాశాఖ కార్యాలయానికి సమర్పించాలని అధికారులు ఆదేశించారు.

-ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా నిర్వహించాలి: ఎంఈఓలు ఖాజా మొహిద్దీన్, ఈశ్వరయ్య

చిట్వేల్, డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చిట్వేల్ మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో కూడా శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0ను తప్పనిసరిగా నిర్వహించాలని మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈఓలు) ఖాజా మొహిద్దీన్ మరియు ఈశ్వరయ్య లు తెలియజేశారు.

-సక్రమ నిర్వహణకు ఆదేశాలు

ప్రభుత్వం జారీ చేసిన షెడ్యూల్ మరియు నియమ నిబంధనల ప్రకారం ఈ సమావేశాలను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యాలపై ఉందని ఎంఈఓలు స్పష్టం చేశారు.ఈ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థి ప్రగతి, పాఠశాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు, విద్యా ప్రమాణాల మెరుగుదల వంటి అంశాలపై చర్చించనున్నారు.మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ ముఖ్యమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దీనికి సంబంధించిన నివేదికను మండల విద్యాశాఖ కార్యాలయానికి సమర్పించాలని అధికారులు ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.