నేటి బంద్ ను జయప్రదం చేయండి
కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయండి :
__ బిజెపి టూ టౌన్ ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవ్
బీసీల హక్కుల సాధనకు శనివారం తలపెట్టిన బంద్ ను జయప్రదం చేయాలని శనివారం ఒక ప్రకటనలో బీజేపీ టూ టౌన్ ప్రధాన కార్యదర్శి రుద్ర గాని మాధవ్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు
ప్రతి ఎన్నికల ముంగిటా కాంగ్రెస్ పార్టీకి బిజెపి పార్టీ మీద ఏదో ఒక ఆరోపణ చేయటం ఆనవాయితీగా మారిందని విమర్శించారు . బీసీల పై ప్రేమ , బీసీల రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే బిసి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలనీ , 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు అంటూ చేసిన ప్రకటన పట్ల కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను సజావుగా జరపాలని డిమాండ్ చేశారు . బీసీల హక్కుల సాధనకు 18 వ తేదీన తలపెట్టిన తెలంగాణ బందును విజయవంతం చేయాలని తన ప్రకటనలో పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను వెంటనే అమలు రుద్రగాని మాధవ్ చేయాలని కోరారు.

నేటి బంద్ ను జయప్రదం చేయండి కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయండి
నేటి బంద్ ను జయప్రదం చేయండి కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయండి : __ బిజెపి టూ టౌన్ ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవ్ బీసీల హక్కుల సాధనకు శనివారం తలపెట్టిన బంద్ ను జయప్రదం చేయాలని శనివారం ఒక ప్రకటనలో బీజేపీ టూ టౌన్ ప్రధాన కార్యదర్శి రుద్ర గాని మాధవ్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రతి ఎన్నికల ముంగిటా కాంగ్రెస్ పార్టీకి బిజెపి పార్టీ మీద ఏదో ఒక ఆరోపణ చేయటం ఆనవాయితీగా మారిందని విమర్శించారు . బీసీల పై ప్రేమ , బీసీల రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే బిసి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలనీ , 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు అంటూ చేసిన ప్రకటన పట్ల కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను సజావుగా జరపాలని డిమాండ్ చేశారు . బీసీల హక్కుల సాధనకు 18 వ తేదీన తలపెట్టిన తెలంగాణ బందును విజయవంతం చేయాలని తన ప్రకటనలో పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను వెంటనే అమలు రుద్రగాని మాధవ్ చేయాలని కోరారు.

