నెల్లూరు రూరల్ (పున్నమి ప్రతినిధి ) అక్టోబర్ : 18. నెల్లూరు రూరల్ మండలం పరిధిలోని పలు చోట్ల గత నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దాని కారణం గా చిన్న చెరువులు, కుంటలు నిండు కుండలు తలపిస్తున్నాయి. ఎండలు తగ్గి చల్లటి వాతావరణం కనిపించడం తో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వర్షాలు ఎక్కువ కావడం తో విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీపావళి దగ్గరకు రావటంతో దీపావళి వస్తువులు అమ్మే వ్యాపారస్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటికి వెళ్లాలంటే వర్షం, ఇంట్లో ఉంటే కష్టం అన్న సామెతగా, నెల్లూరు రూరల్ పరిధిలో కొన్ని ఏరియాలు జాలాదిగ్బoదం అయ్యాయి. రోడ్లు, రహదారులు నీళ్ల తో నిండి కాలువలు పొంగి పొర్లుతున్నాయి. మురికి నీరు చేరటంతో విషయ జ్వరాలు ప్రభలే అవకాశం ఉన్నందున మున్సిపల్, హెల్త్ అధికారులు రోగాలు ప్రభలకుండా అన్ని శానిటేషన్ చర్యలు తీసుకొని పారిశుధ్యo పై దృష్టి పెట్టాలని ప్రజలు అధికారులను కోరుకుంటున్నారు.

నెల్లూరు లో జోరుగా వర్షాలు