నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమం ముఖ్య వేదికగా మారిందని టిడిపి నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
నెల్లూరు రూరల్, మార్చి 14:
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో టిడిపి నాయకుడు Kotamreddy Giridhar Reddy పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ప్రజలకు ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరియు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ఆ దేశాల మేరకు ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తెలియజేసే సమస్యలను అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ప్రజాదర్బార్ ద్వారా వచ్చిన వినతుల ఆధారంగా ఇప్పటికే రూ.27 కోట్ల వ్యయంతో 240 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ నెల 22వ తేదీన ఆ 240 అభివృద్ధి పనులను కూటమి నాయకులు మరియు స్థానిక ప్రజల సమక్షంలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ మన్నెం పెంచలనాయుడు, కో-క్లస్టర్ ఇంచార్జ్ విష్ణు ప్రియ, 22వ డివిజన్ కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి, 20వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు దారా మల్లి, 32వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు తోట సునీల్, టిడిపి నాయకులు మాధవి, షేక్ రియాజ్, బషీర్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


