నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ.41 కోట్లతో 339 అభివృద్ధి పనుల భారీ ప్రారంభోత్సవం:కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి

0
48

నెల్లూరు రూరల్రూ నియోజకవర్గం లో రూ .41 కోట్ల వ్యయంతో 60 రోజుల వ్యవధిలో పూర్తి చేసిన 339 అభివృద్ధి పనుల భారీ ప్రారంభోత్సవం మే 15,న ఉదయం 9:00 గంటలకు జరగుతుందిని అని MLA శ్రీధర్ రెడ్డి తెలిపారు .నగరం లో ని మాగుంట లేఔట్ నెల్లూరు రూరల్ mla కార్యాలయం లో ఆదివారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడు తు కల్లూరుపల్లి హోసింగ్ బోర్డు కాలనీ మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవంతో ఈ కార్యక్రమం మొదలవుతుందిఅన్నారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర మునిసిపల్ శాఖామంత్రి  పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ  బీద రవిచంద్ర పాల్గొంటారు. 678 మంది తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకులు, కార్యకర్తలు ఒక్కో పనిని ఇద్దరు చొప్పున ప్రారంభిస్తారు. వివిధ శాఖల అధికారులు, కూటమి పార్టీ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

“ఒకే నియోజకవర్గంలో ఒకే రోజు ఇన్ని ప్రారంభోత్సవాలు దేశంలో ఎక్కడా జరగలేదు. ఇది అభివృద్ధి పట్ల మా నిబద్ధతకు, ప్రజల నమ్మకానికి నిదర్శనం” అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్‌లో వివిధ శాఖల కింద రూ.231.78 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తయ్యాయి లేదా ప్రగతిలో ఉన్నాయని ఆయన తెలిపారు.

త్వరలో కొండాయపాలెం, భక్తవత్సల నగర్‌లలో రైల్వే గేట్ అండర్ బ్రిడ్జి పనులను ప్రారంభించనున్నట్లు శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. ఈ అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్, యువ నాయకుడు శ్రీ నారా లోకేష్‌లకు, తనను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన నాయకులు, కార్యకర్తలు, ఓటర్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

0
0