Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

నెల్లూరు ప్రజా వేదికకు 24 వినతులు

Punnami Newsroom Published:
నెల్లూరు ప్రజా వేదికకు 24 వినతులు

Story highlights

  • నెల్లూరు ప్రజా వేదికకు 24 వినతులు ప్రజల ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని మేయర్ దేవరకొండ సుజాత అశోక్ తెలిపారు.
  • సోమవారం నగరపాలక సంస్థలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ వై.ఓ.
  • నందన్‌తో కలిసి 24 వినతులు స్వీకరించారు.

నెల్లూరు ప్రజా వేదికకు 24 వినతులు

ప్రజల ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని మేయర్ దేవరకొండ సుజాత అశోక్ తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ వై.ఓ. నందన్‌తో కలిసి 24 వినతులు స్వీకరించారు. ఇంజనీరింగ్‌కు పది, టిడ్కోకు ఏడు, టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూకు మూడేసి, ప్రజారోగ్యానికి ఒక వినతి అందాయి. నగరంలో ₹240 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కమిషనర్ చెప్పారు. ప్రభుత్వ స్థలాలు, డ్రైన్లపై ఆక్రమణలు చేయవద్దని సూచించారు. ఎన్నికలకు సంబంధించి 72 డివిజన్లలో 509 పోలింగ్ బూతుల ఏర్పాటు పనులు పూర్తయ్యాయన్నారు. రిజర్వేషన్ల నివేదికలను ఎన్నికల కమిషన్‌కు పంపినట్లు వెల్లడించారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో సాయంత్రం టిడ్కో పట్టాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పనులతో కలిగే తాత్కాలిక అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని కోరారు. అందిన ఫిర్యాదులను సంబంధిత విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని తెలిపారు. వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *