నెల్లూరు పొదలకూరు-నెల్లూరు మధ్య నిలిచిన రాకపోకలు
నెల్లూరు రూరల్ (పున్నమి ప్రతినిధి ) అక్టోబర్ 22: పొదలకూరు మండలంలో భారీ వర్షాలు కురిశాయి. ఈక్రమంలో నావూరు వద్ద పెద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రోడ్డుపైకి నీరు చేరడంతో పొదలకూరు, నెల్లూరు, రాపూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

