నెల్లూరు జిల్లా పోలీసుల ప్రజా ఫిర్యాదుల వేదిక – 126 ఫిర్యాదులు స్వీకరణ
నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (Public Grievance Redressal System) కార్యక్రమంలో మొత్తం 126 ఫిర్యాదులు స్వీకరించబడినట్లు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ,
ప్రజా ఫిర్యాదులపై ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం చూపకూడదని
ప్రతి ఫిర్యాదును బాధ్యతగా తీసుకుని, చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు అధికారులకు ఆదేశించారు.
అలాగే, ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం పోలీసు శాఖ ముఖ్య బాధ్యత అని స్పష్టం చేశారు.
ముఖ్య ఫిర్యాదుల వివరాలు:
రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తికి న్యాయం చేయాలంటూ వేంకటాచల సత్రం పోలీస్ స్టేషన్ పరిధి నుండి ఫిర్యాదు
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.3.75 లక్షలు తీసుకుని మోసం చేసిన కేసు – వరికుంటపాడు
కుటుంబ వేధింపులపై మహిళ ఫిర్యాదు – నవాబుపేట
ప్రేమ పేరుతో వేధింపులు, దాడి ఘటన – బిట్రగుంట
భర్త వివాహేతర సంబంధం, గృహ హింస – బుచ్చిరెడ్డిపాలెం
కుమారుడు చెడు అలవాట్లతో వేధిస్తున్నాడని తల్లి ఫిర్యాదు – కొడవలూరు
వచ్చిన అన్ని ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ గారు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీమతి సౌజన్య, డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు సుబ్బారావు, భాక్తవత్సల్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


