కరోనా వైరస్ బారిన పడి చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నెల్లూరుకు చెందిన ఆర్థోపెడిక్ డాక్టర్ లక్ష్మీ నారాయణ రెడ్డి కొద్ది సేపటి క్రితం చెన్నైలో కన్నుమూశారు. గత నెలాఖరున విదేశాలకు వెళ్లివచ్చిన డాక్టర్ లక్ష్మీ నారాయణ రెడ్డి ఈ నెల మొదటి వారం నెలూరులో నూతన హాస్పిటల్ భవనాన్ని కూడా ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన తీవ్ర అస్వస్థతకు గురికాగా నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించమించడంతో నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆయనకు పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.
ఆ డాక్టర్ కోరిక మేరకు మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలో కు తరలించారు. అక్కడ కూడా ఆయన పరిస్థితి మెరుగుపడలేదు. పెద్ద వయసు కావడం, బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక రోగాలు ఉండటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఇవాళ మధ్యాహ్నం చెన్నై అపోలో హాస్పిటల్ లో కన్నుమూసినట్లు ఆయన సన్నిహితులు తెలియజేసారు. మృతి చెందిన డాక్టర్ భార్యకు, హాస్పిటల్ ఫార్మాసిస్ట్ కు కూడా కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహాన్ని నెల్లూరుకు తీసుకురాకుండా చెన్నైలోనే అంత్యక్రియలు నిర్వహించేలా కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే డాక్టర్ మృతి విషయం జిల్లా అధికారులు ఇంకా దృవీకరించలేదు.జిల్లా ప్రజలు నష్టం జరిగిందని భాధ పడటం కాకుండా కనీసం పద్దతులను పాటిస్తూ లాక్ డౌన్ ద్వారా ప్రభుత్వానికి పోలీసులకు సహకరించాలని పున్నమి కోరుకుంటుంది.