Story highlights
- 🔴 దుత్తలూరు మండలంలో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం!
- 📍 దుత్తలూరు: నెల్లూరు జిల్లాలో గంజాయి సాగుకు సంబంధించిన సమాచారం స్థానికంగా కలకలం రేపుతోంది.
- దుత్తలూరు పరిధిలోని సర్వే నంబర్ 1582లో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.
🔴 దుత్తలూరు మండలంలో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం!
📍 దుత్తలూరు:
నెల్లూరు జిల్లాలో గంజాయి సాగుకు సంబంధించిన సమాచారం స్థానికంగా కలకలం రేపుతోంది. దుత్తలూరు పరిధిలోని సర్వే నంబర్ 1582లో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.
🚨 రంగంలోకి దిగిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు!
నెల్లూరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఈ వ్యవహారంపై దాడులు నిర్వహించినట్లు సమాచారం. మొత్తం 9.50 ఎకరాల భూమిలో సుమారు రెండున్నర ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది.
👮 ముగ్గురు అదుపులోకి?
ఈ వ్యవహారానికి సంబంధించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అలాగే మరికొందరు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రాంతానికి చెందినవారిగా తెలుస్తోంది.
🔎 గంజాయి సాగు వెనుక ఎవరున్నారు? 🔎 ఈ సాగుకు సంబంధించి ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? 🔎 పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయా?
ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
🚨 దుత్తలూరు ప్రాంతంలో గంజాయి సాగు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది!