పున్నమి ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర బీజేపీ కమిటీ ని ఇటీవల రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామచంద్ర రావు ప్రకటించారు. కమిటీ లో ఖమ్మం జిల్లా కీ చెందిన ప్రముఖులు దేవకీ వాసు దేవరావ్ కీ కోశాధికారి పదవి లభించింది. ఈ నేపథ్యంలో నేడు బీజేపీ రాష్ట్ర కార్యలయం లో వాసుదేవ రావ్ పదవి భాద్యత లు స్వీకరణ సందర్భంగా బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నుండి బీజేపీ శ్రేణులు హైదరాబాద్ తరలివెళ్లారు. హైదరాబాద్ రాష్ట్ర కార్యలయం లో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యకర్తల సమావేశం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ చంద్ర రావు మాట్లాడుతు ఖమ్మం జిల్లా లో అందరు కలసి కట్టు గా పని చెయ్యాలి అని, రాబోయే స్థానిక సంస్థ ల ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కష్టపడి పని చేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి అని విజ్ఞప్తి చేసారు.
ఈ కార్యక్రమం లో భద్రాద్రి కొత్త గూడెం జిల్లా మాజీ అధ్యక్షులు రంగా కిరణ్, ఖమ్మం జిల్లా నాయకులు నున్న రవికుమార్, మండదపు సుబ్బారావు, నంబూరి రామలింగేశ్వరావ్, సుదర్శన్ మిశ్ర, పడిగల మధు, నాయుడు రాఘవ, వీరపనేని అప్పారావు, వల్లల రమేష్, పిల్లలమర్రి వెంకట్నారాయణ, కొణతము లక్ష్మి నారాయణ లతో పాటు
ఖమ్మం జిల్లా కీ చెందిన పలువురు మండల అధ్యక్షులు, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుపాల్గొన్నారు


