నెల్లూరు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఏర్పాట్లు పూర్తి
వైయస్ షర్మిల ముఖ్య అతిథిగా హాజరు కానున్న వేళ
నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ 24, మంగళవారం ఉదయం 9:30 గంటలకు నెల్లూరు ఇందిరా భవన్‌లో జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిల రెడ్డి గారు హాజరుకానున్నారు. ఆమెతో పాటు ఇతర రాష్ట్ర స్థాయి నేతలు కూడా పాల్గొననున్నారు.
ఈ సమావేశానికి నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు, మండల/పట్టణ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, విద్యార్థి, యువజన, మహిళా, రైతు, కార్మిక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విభాగాల నేతలు పెద్ద సంఖ్యలో హాజరై పార్టీ మద్దతును మరింత బలోపేతం చేయనున్నారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి ఈ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. “కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి ఈ సమావేశం మైలురాయి అవుతుంది” అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.