Saturday, 19 July 2025
  • Home  
  • నెల్లూరు ఈఎస్‌ఐలోనూ అవినీతి జాడలు
- Featured - ఆంధ్రప్రదేశ్

నెల్లూరు ఈఎస్‌ఐలోనూ అవినీతి జాడలు

భారీ మొత్తంలో గడువు తీరే మందులు కొనుగోళ్లు కార్మికుల వైద్యానికి కాస్మోటిక్‌ ఔషధాల్ణు విజిలెన్స్‌ విచారణలో వెలుగుచూస్తున్న అక్రమాలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం – విజిలెన్స్‌ ఎస్పీ ఎం.వి.సుబ్బారెడ్డి. (నెల్లూరు, పున్నమి ప్రతినిధి) తలవెంట్రుకలు… పెరిగేందుకు… అక్కడ భారీఎత్తున ఔషధాలు కొన్నారు… అక్కడ ఈసీజీ..పరికరాలు.. లేకున్నా… వాటికోసం లక్షల్లో బిల్లులు చేశారు.. ఇదేదో కాస్మొటిక్‌… అవసరాలకు… కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ లో బిల్లులు అనుకునేరు… నిరుపేద కార్మికులకు తూతూ మంత్రంగా సేవలందించే ఇఎస్‌ ఐ హాస్పిటల్స్‌ లో డ్రగ్స్‌ కొనుగోళ్లు మాటున జరుగుతున్న అక్రమాలు… జ్వరమొస్తేనే.. మాత్రలు లేవనే ఈ హాస్పిటల్స్‌ లో మందులపేరు తో జరిగిన దోపిడీలుపై విచారణ జరుగుతున్న నేపద్యంలో నెల్లూరులోనూ ఆశ్చర్యం కలిగించే అక్రమాలు బయటపడుతున్నాయి.. ఇంతకీ జిల్లాలో ఈ ఎస్‌ ఐ హాస్పిటల్స్‌ అక్రమాలేంటో మీరే చదవండి. ఈ ఎస్‌ ఐ ఆసుపత్రుల్లో..కార్మికులకు అత్యవసరంగా చికిత్స అందించాలంటే… సవాలక్ష కారణాలు చెపుతారు.. అక్కడి వైద్యులు… ఏఒక్క జబ్బుకీ…సరైన మందులు కనిపించని ఆ వైద్యశాలల్లో.. సౌందర్యపోషణకు కూడా చికిత్స అందిస్తాయంట…అందుకోసమే వీరు మందులు కొనుగొలు చేసినట్లు రికార్డులు తయారు చేసారు.నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ పోర్స్‌ మెంట్‌ తనిఖీలలో నమ్మలేని వాస్తవాలు బయటపడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా ఈ ఎస్‌ ఐ అసుపత్రులలో జరుగుతున్న తనిఖీలు దిమ్మ తిరిగే వాస్తవాలను వెలికి తెస్తున్నాయి.విన్న వారంతా ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి.తెలంగాణ రాష్టంలో ఈఎస్‌ ఐ అసుపత్రులలో జరిగిన మందుల కుంభకోణం తర్వాత ఎపిలో కూడా రాష్ట వ్యాప్తంగా విజిలెన్స్‌ ఇప్పుడు ఈఎస్‌ ఐ అసుపత్రులలో తనిఖీలు నిర్వహిస్తుంది.ఇందులో బాగంగా జిల్లా వ్యాప్తంగా మూడు ప్రాంతాలలో తనిఖీలు చేసింది.జిల్లాలో నెల్లూరులోని పోదలకూరు రోడ్డు లోని అసుపత్రి,కావలి ,సూళ్ళురు పేట లలో వున్నక్లీనిక్‌ లలో విజిలెన్స్‌ తనిఖీలు నిర్వహించింది.అక్కడ రికార్డులతో పాటు మందుల నిల్వ,ఎక్కడ నుంచి కొనుగొలు చేసారు.ఎలాంటి మందులు కొనుగొలు చేసారు లాంటి వాటిపై తనిఖీలు చేస్తున్నారు. కార్మికులు,ప్రయివేటు కంపెనీల సిబ్బందికి ఈఎస్‌ ఐ అసుపత్రులలో చికిత్స అందిస్తారు.నెల్లూరు నగరంలోరెండు,సూళ్ళురు పేటలో రెండు ,గూడురులో 1,తడ,కావలిలలో రెండు ఈఎస్‌ ఐ అసుపత్రులు నడుస్తున్నాయి.వాటి పరిదిలో కార్మికులకు ఎక్కువుగా చికిత్సలు అందిస్తారు. అయితే తనిఖీలలో విచిత్రమైన అంశాలు బయటపడ్డట్లు తెలుస్తోంది.కావలి ఈఎస్‌ ఐ అసుపత్రిలో అయితే జుట్టు రాలకుండ వుండేందుకు వాడే మందులు 60-100 కేస్‌ ల వాడినట్లు రికార్డులు లలో వుంది.అయితే వ్యాదుల చికిత్సకు మందులు ఇవ్వాల్సిన అసుపత్రిలో సౌందర్యానికి ఉపయోగపడే మందులు ఎందుకు వాడారన్నది ఇప్పుడు విజిలెన్స్‌ అదికారులనే విస్మయానికి గురిచేసింది.సూళ్ళురు పేటలో ప్రభుత్వం పంపించిన మందులు కాకుండా బయట అధికంగా కొనుగొలు చేసినట్లు రికార్డులు చూపించారు. అంతేకాకుండా పది మంది రోగులు వస్తుంటే వారి సంఖ్యను నాలుగింతలు పెంచినట్లు విజిలెన్స్‌ తనిఖీలలో బయటపడింది.మిగిలిన వారికి కూడా మందులు పంపిణీ చేసి నట్లు రికార్డులు తయారు చేసుకున్నట్లు గుర్తించారు అదికారులు.తనిఖీలు మరింత కాలం కొనసాగుతాయని అంటున్నారు విజిలెన్స్‌ అదికారులు…అయితే పూర్తి వివరాలు తనిఖీలు ముగిసిన తర్వాత చెబుతామంటున్నారు. ఈ ఎస్‌ ఐ ఆసుపత్రుల్లో అక్రమాలు తెలంగాణాకు పరియం8తమనుకున్న విజిలెన్స్‌ అధికారులకు ఇక్కడి మందుల కొనుగోళ్లు… వాటిపంపిణి చూసి మైండ్‌ బ్లాక్‌ అవుతోంది… ఊహించని జబ్బులకు మందులు కొనుగోలు చేశారు… గాయాలకు… జ్వరాలకు మాత్రలు దొరకని ఈ కార్మిక దవాఖానలో మాత్రం… కాస్ట్లీ మందులు భారీగా కొన్నారు.. అందులోనూ రికార్డుల్లో మాత్రమే… నిరుపేద కార్మికులకు వైద్యసేవలు అందించినట్లు సొమ్ముచేసుకున్న అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి…

భారీ మొత్తంలో గడువు తీరే మందులు కొనుగోళ్లు
కార్మికుల వైద్యానికి కాస్మోటిక్‌ ఔషధాల్ణు
విజిలెన్స్‌ విచారణలో వెలుగుచూస్తున్న అక్రమాలు
పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం – విజిలెన్స్‌ ఎస్పీ ఎం.వి.సుబ్బారెడ్డి.
(నెల్లూరు, పున్నమి ప్రతినిధి)
తలవెంట్రుకలు… పెరిగేందుకు… అక్కడ భారీఎత్తున ఔషధాలు కొన్నారు… అక్కడ ఈసీజీ..పరికరాలు.. లేకున్నా… వాటికోసం లక్షల్లో బిల్లులు చేశారు.. ఇదేదో కాస్మొటిక్‌… అవసరాలకు… కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ లో బిల్లులు అనుకునేరు… నిరుపేద కార్మికులకు తూతూ మంత్రంగా సేవలందించే ఇఎస్‌ ఐ హాస్పిటల్స్‌ లో డ్రగ్స్‌ కొనుగోళ్లు మాటున జరుగుతున్న అక్రమాలు… జ్వరమొస్తేనే.. మాత్రలు లేవనే ఈ హాస్పిటల్స్‌ లో మందులపేరు తో జరిగిన దోపిడీలుపై విచారణ జరుగుతున్న నేపద్యంలో నెల్లూరులోనూ ఆశ్చర్యం కలిగించే అక్రమాలు బయటపడుతున్నాయి.. ఇంతకీ జిల్లాలో ఈ ఎస్‌ ఐ హాస్పిటల్స్‌ అక్రమాలేంటో మీరే చదవండి.
ఈ ఎస్‌ ఐ ఆసుపత్రుల్లో..కార్మికులకు అత్యవసరంగా చికిత్స అందించాలంటే… సవాలక్ష కారణాలు చెపుతారు.. అక్కడి వైద్యులు… ఏఒక్క జబ్బుకీ…సరైన మందులు కనిపించని ఆ వైద్యశాలల్లో.. సౌందర్యపోషణకు కూడా చికిత్స అందిస్తాయంట…అందుకోసమే వీరు మందులు కొనుగొలు చేసినట్లు రికార్డులు తయారు చేసారు.నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ పోర్స్‌ మెంట్‌ తనిఖీలలో నమ్మలేని వాస్తవాలు బయటపడుతున్నాయి.
నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా ఈ ఎస్‌ ఐ అసుపత్రులలో జరుగుతున్న తనిఖీలు దిమ్మ తిరిగే వాస్తవాలను వెలికి తెస్తున్నాయి.విన్న వారంతా ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి.తెలంగాణ రాష్టంలో ఈఎస్‌ ఐ అసుపత్రులలో జరిగిన మందుల కుంభకోణం తర్వాత ఎపిలో కూడా రాష్ట వ్యాప్తంగా విజిలెన్స్‌ ఇప్పుడు ఈఎస్‌ ఐ అసుపత్రులలో తనిఖీలు నిర్వహిస్తుంది.ఇందులో బాగంగా జిల్లా వ్యాప్తంగా మూడు ప్రాంతాలలో తనిఖీలు చేసింది.జిల్లాలో నెల్లూరులోని పోదలకూరు రోడ్డు లోని అసుపత్రి,కావలి ,సూళ్ళురు పేట లలో వున్నక్లీనిక్‌ లలో విజిలెన్స్‌ తనిఖీలు నిర్వహించింది.అక్కడ రికార్డులతో పాటు మందుల నిల్వ,ఎక్కడ నుంచి కొనుగొలు చేసారు.ఎలాంటి మందులు కొనుగొలు చేసారు లాంటి వాటిపై తనిఖీలు చేస్తున్నారు. కార్మికులు,ప్రయివేటు కంపెనీల సిబ్బందికి ఈఎస్‌ ఐ అసుపత్రులలో చికిత్స అందిస్తారు.నెల్లూరు నగరంలోరెండు,సూళ్ళురు పేటలో రెండు ,గూడురులో 1,తడ,కావలిలలో రెండు ఈఎస్‌ ఐ అసుపత్రులు నడుస్తున్నాయి.వాటి పరిదిలో కార్మికులకు ఎక్కువుగా చికిత్సలు అందిస్తారు. అయితే తనిఖీలలో విచిత్రమైన అంశాలు బయటపడ్డట్లు తెలుస్తోంది.కావలి ఈఎస్‌ ఐ అసుపత్రిలో అయితే జుట్టు రాలకుండ వుండేందుకు వాడే మందులు 60-100 కేస్‌ ల వాడినట్లు రికార్డులు లలో వుంది.అయితే వ్యాదుల చికిత్సకు మందులు ఇవ్వాల్సిన అసుపత్రిలో సౌందర్యానికి ఉపయోగపడే మందులు ఎందుకు వాడారన్నది ఇప్పుడు విజిలెన్స్‌ అదికారులనే విస్మయానికి గురిచేసింది.సూళ్ళురు పేటలో ప్రభుత్వం పంపించిన మందులు కాకుండా బయట అధికంగా కొనుగొలు చేసినట్లు రికార్డులు చూపించారు. అంతేకాకుండా పది మంది రోగులు వస్తుంటే వారి సంఖ్యను నాలుగింతలు పెంచినట్లు విజిలెన్స్‌ తనిఖీలలో బయటపడింది.మిగిలిన వారికి కూడా మందులు పంపిణీ చేసి నట్లు రికార్డులు తయారు చేసుకున్నట్లు గుర్తించారు అదికారులు.తనిఖీలు మరింత కాలం కొనసాగుతాయని అంటున్నారు విజిలెన్స్‌ అదికారులు…అయితే పూర్తి వివరాలు తనిఖీలు ముగిసిన తర్వాత చెబుతామంటున్నారు.
ఈ ఎస్‌ ఐ ఆసుపత్రుల్లో అక్రమాలు తెలంగాణాకు పరియం8తమనుకున్న విజిలెన్స్‌ అధికారులకు ఇక్కడి మందుల కొనుగోళ్లు… వాటిపంపిణి చూసి మైండ్‌ బ్లాక్‌ అవుతోంది… ఊహించని జబ్బులకు మందులు కొనుగోలు చేశారు… గాయాలకు… జ్వరాలకు మాత్రలు దొరకని ఈ కార్మిక దవాఖానలో మాత్రం… కాస్ట్లీ మందులు భారీగా కొన్నారు.. అందులోనూ రికార్డుల్లో మాత్రమే… నిరుపేద కార్మికులకు వైద్యసేవలు అందించినట్లు సొమ్ముచేసుకున్న అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.