Tuesday, 24 March 2026
  • Home  
  • నెల్లూరులో లాడ్జిలపై పోలీసుల ఆకస్మిక దాడులు – 36 మంది అదుపులో
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో లాడ్జిలపై పోలీసుల ఆకస్మిక దాడులు – 36 మంది అదుపులో

నెల్లూరు పట్టణంలోని చిన్నబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కొన్ని లాడ్జిలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అందిన విశ్వసనీయ సమాచారంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్.పి. ఆదేశాల మేరకు, అడ్మిన్ అదనపు ఎస్.పి. శ్రీమతి CH. సౌజన్య సూచనలతో, టౌన్ ఏఎస్‌పి శ్రీమతి దీక్ష, ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఈ తనిఖీలు చేపట్టింది. మనాసి, పీఎస్‌కే, పీవీకే, సాయి లాడ్జిలలో తనిఖీలు జరిపిన పోలీసులు, అక్కడ వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో 14 మంది మహిళలు, 17 మంది పురుషులు, 5 మంది హోటల్ సిబ్బంది కలిపి మొత్తం 36 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి 27 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. లాడ్జి నిర్వాహకుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అనుమానాస్పద కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పట్టణంలో శాంతి భద్రతల కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసు అధికారులను జిల్లా ఎస్.పి. అభినందించారు.

నెల్లూరు పట్టణంలోని చిన్నబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కొన్ని లాడ్జిలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అందిన విశ్వసనీయ సమాచారంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్.పి. ఆదేశాల మేరకు, అడ్మిన్ అదనపు ఎస్.పి. శ్రీమతి CH. సౌజన్య సూచనలతో, టౌన్ ఏఎస్‌పి శ్రీమతి దీక్ష, ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఈ తనిఖీలు చేపట్టింది.
మనాసి, పీఎస్‌కే, పీవీకే, సాయి లాడ్జిలలో తనిఖీలు జరిపిన పోలీసులు, అక్కడ వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో 14 మంది మహిళలు, 17 మంది పురుషులు, 5 మంది హోటల్ సిబ్బంది కలిపి మొత్తం 36 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి 27 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
లాడ్జి నిర్వాహకుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అనుమానాస్పద కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పట్టణంలో శాంతి భద్రతల కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు.
ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసు అధికారులను జిల్లా ఎస్.పి. అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.