నవంబర్ నెల్లూరు (పున్నమి ప్రతినిధి)
జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 113 ఫిర్యాదులు స్వీకరించినట్టు జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం వహించకూడదని, ప్రతి పిటీషన్‌పై చట్టపరంగా త్వరితగతిన న్యాయం చేయాలని సూచించారు.
వచ్చిన ఫిర్యాదుల్లో ఉద్యోగ మోసం, వివాహ వాగ్దానం చేసి మోసం చేయడం, కుటుంబ వేధింపులు, వృద్ధుల ఆస్తి సమస్యలు, అదృశ్యమైన మహిళ ఆచూకీ వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తామని యస్.పి. హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో అడిషనల్ యస్.పి. సౌజన్య, రూరల్ DSP శ్రీనివాసరావు, SB DSP, లీగల్ అడ్వైజర్ మరియు కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.


