నెల్లూరులో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 8వ తేదీన మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు వెంకటేశ్వరపురం ఐటీఐ బాయ్స్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
జాబ్ మేళాలో మొత్తం 15 ప్రముఖ కంపెనీలు ఇంటర్వ్యూలను నిర్వహించి, అర్హత గల అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలను అందించనున్నట్లు తెలిపారు. ఇంటర్వ్యూలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయన్నారు.
ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువత ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని, తమ భవిష్యత్‌ను నిర్మించుకోవాలని ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి కోరారు.

నెల్లూరులో ఈ నెల 8న మెగా జాబ్ మేళ
నెల్లూరులో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 8వ తేదీన మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు వెంకటేశ్వరపురం ఐటీఐ బాయ్స్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జాబ్ మేళాలో మొత్తం 15 ప్రముఖ కంపెనీలు ఇంటర్వ్యూలను నిర్వహించి, అర్హత గల అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలను అందించనున్నట్లు తెలిపారు. ఇంటర్వ్యూలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయన్నారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువత ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని, తమ భవిష్యత్‌ను నిర్మించుకోవాలని ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి కోరారు.

