Tuesday, 10 March 2026
  • Home  
  • నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS

SPS నెల్లూరు జిల్లా నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS ఆధ్వర్యంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పోలీసు అధికారులతో కలిసి వివిధ నేరాలపై సమగ్రంగా సమీక్షించారు. స్మార్ట్ పోలీసింగ్ ద్వారా ఆధునిక సాంకేతికత, డేటా విశ్లేషణ, సీసీటీవీ నిఘా, డ్రోన్లు మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను వినియోగించి నేరాలను ముందుగానే గుర్తించి ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలని ఎస్పీ సూచించారు. గ్రేవ్ కేసుల విచారణను నిర్ణీత గడువులో పూర్తి చేసి ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. PGRS పిటిషన్లను తక్షణమే పరిష్కరించడంతో పాటు డయల్-112 కాల్స్‌కు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకోవాలని చెప్పారు. ప్రతి కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి దర్యాప్తు చేయడం ద్వారా కన్విక్షన్ రేటు పెంచాలని సూచించారు. ఓపెన్ డ్రింకింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి నేరాలను నియంత్రించాలని, రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి నిబంధనలు ఉల్లంఘించిన వారి బెయిల్ రద్దు చేయించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ఇతర శాఖలతో కలిసి బ్లాక్ స్పాట్స్‌ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రోన్ సర్వైలెన్స్ పెంచడం, ముఖ్య ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై అవగాహన కల్పించడం, అనుమానిత ప్రాంతాల్లో కార్డన్ ఆపరేషన్స్ నిర్వహించడం వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మిస్సింగ్ కేసులను ప్రత్యేక బృందాలతో వెంటనే చేధించాలని, ప్రతి అధికారి తప్పనిసరిగా విలేజ్ విజిట్ చేయాలని పేర్కొన్నారు. రాత్రి గస్తీలను ముమ్మరం చేసి అనుమానితుల వేలిముద్రలు సేకరించాలని సూచించారు. అనంతరం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసులు, హత్య, POCSO, రేప్, డెకాయిటి, రాబరీ, ప్రాపర్టీ, వాహనాల దొంగతనం, మిస్సింగ్, చీటింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 Cr.P.C కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ పనులు, పెండింగ్ NBWs, NDPS కేసులపై సర్కిల్ వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీమతి CH. సౌజన్య, ఎస్‌బీ, కావలి, ఆత్మకూరు డీఎస్పీలు మరియు ఇతర జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.

SPS నెల్లూరు జిల్లా
నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS
నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS ఆధ్వర్యంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పోలీసు అధికారులతో కలిసి వివిధ నేరాలపై సమగ్రంగా సమీక్షించారు.
స్మార్ట్ పోలీసింగ్ ద్వారా ఆధునిక సాంకేతికత, డేటా విశ్లేషణ, సీసీటీవీ నిఘా, డ్రోన్లు మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను వినియోగించి నేరాలను ముందుగానే గుర్తించి ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలని ఎస్పీ సూచించారు. గ్రేవ్ కేసుల విచారణను నిర్ణీత గడువులో పూర్తి చేసి ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు.
PGRS పిటిషన్లను తక్షణమే పరిష్కరించడంతో పాటు డయల్-112 కాల్స్‌కు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకోవాలని చెప్పారు. ప్రతి కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి దర్యాప్తు చేయడం ద్వారా కన్విక్షన్ రేటు పెంచాలని సూచించారు.
ఓపెన్ డ్రింకింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి నేరాలను నియంత్రించాలని, రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి నిబంధనలు ఉల్లంఘించిన వారి బెయిల్ రద్దు చేయించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ఇతర శాఖలతో కలిసి బ్లాక్ స్పాట్స్‌ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు.
డ్రోన్ సర్వైలెన్స్ పెంచడం, ముఖ్య ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై అవగాహన కల్పించడం, అనుమానిత ప్రాంతాల్లో కార్డన్ ఆపరేషన్స్ నిర్వహించడం వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మిస్సింగ్ కేసులను ప్రత్యేక బృందాలతో వెంటనే చేధించాలని, ప్రతి అధికారి తప్పనిసరిగా విలేజ్ విజిట్ చేయాలని పేర్కొన్నారు.
రాత్రి గస్తీలను ముమ్మరం చేసి అనుమానితుల వేలిముద్రలు సేకరించాలని సూచించారు. అనంతరం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసులు, హత్య, POCSO, రేప్, డెకాయిటి, రాబరీ, ప్రాపర్టీ, వాహనాల దొంగతనం, మిస్సింగ్, చీటింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 Cr.P.C కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ పనులు, పెండింగ్ NBWs, NDPS కేసులపై సర్కిల్ వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీమతి CH. సౌజన్య, ఎస్‌బీ, కావలి, ఆత్మకూరు డీఎస్పీలు మరియు ఇతర జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.