ఖమ్మం, జనవరి:
(పున్నమి ప్రతినిధి)
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్యనారాయణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026 సంవత్సరం ప్రజలందరికీ శాంతి, ఆరోగ్యం, సుఖసంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
దేశాభివృద్ధి, రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకెళ్తోందని పేర్కొన్నారు. కొత్త సంవత్సరం యువతకు నూతన అవకాశాలు కల్పిస్తూ సార్థకంగా మారాలని కోరుకుంటున్నట్లు గ తెలియజేసారు.


