నూతన వధూవరులను ఆశీర్వదించిన టిడిపి నాయకులు, పాటూరు శ్రీనివాసులు రెడ్డి
అన్నమయ్య జిల్లా నవంబర్ 01 ( పున్నమి న్యూస్ ప్రతినిధి,, సింగమాల వెంకటేష్ ) రైల్వే కోడూరు నియోజకవర్గం
చిట్వేలి మండలం కేఎస్ అగ్రహారం హరిజనవాడ గ్రామానికి చెందిన కీర్తిశేషులు మోడపోతుల చంగయ్య భార్య మోడపోతుల మారమ్మ కుమార్తె లక్ష్మీదేవి -హరీష్ ల వివాహం కొద్దిరోజుల క్రితం జరిగినది. వివాహ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాటూరు శ్రీనివాసరెడ్డిని మోడపోతుల కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానం అందించారు , భారీ వర్షాల కారణంగా పాటూరు శ్రీనివాసుల రెడ్డి వివాహ కార్యక్రమానికి హాజరు కాలేకపోయినందున, శనివారం నాడు వారి నివాసానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి, వధూవరులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పాటూరు శ్రీనివాసరెడ్డి స్వగృహానికి విచ్చేయడంతో నూతన వధూవరుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో టిడిపి నాయకులు నాగిరెడ్డి కరుణాకర్ రెడ్డి, ఎంపీటీసీ సుబ్రహ్మణ్యం రెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, నాగిరెడ్డి సుబ్బారెడ్డి, సుబ్బరాయుడు, స్థానిక గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


