Wednesday, 18 February 2026
  • Home  
  • నూతన మేయర్‌, చైర్మన్లకు శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- ఖమ్మం

నూతన మేయర్‌, చైర్మన్లకు శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి) ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలకు నూతనంగా ఎన్నికైన మేయర్‌లు, చైర్మన్లు, డిప్యూటీ మేయర్‌లు, వైస్ చైర్మన్లు అలాగే ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఈ నూతన సారథులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణాల అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్‌కు తొలి మేయర్ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన మూడ్ గణేష్ (సీపీఐ), డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన సిరిపురపు లలిత (కాంగ్రెస్)లకు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రజా సంక్షేమం, పట్టణ అభివృద్ధి దిశగా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా ఎన్నికైన చైర్మన్లకు అభినందనలు అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లకు మంత్రి అభినందనలు తెలిపారు. మధిర మున్సిపల్ చైర్మన్ సామినేని సుజాత, వైస్ చైర్మన్ కోట ధనమూర్తి సత్తుపల్లి చైర్మన్ రెహానా బేగం, వైస్ చైర్మన్ బొంతు సుమలత వైరా చైర్మన్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్ అశ్వారావుపేట చైర్మన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ ఎదులాపురం చైర్మన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్ కల్లూరు చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్, వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరి వారందరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆదర్శవంతమైన పాలన అందించాలని మంత్రి సూచించారు. పూర్తి పాలకవర్గాల సమన్వయం కీలకం పట్టణాల్లోని ప్రతి వార్డు, డివిజన్ అభివృద్ధి చెందాలంటే కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో కూడిన పూర్తి పాలకవర్గం పాత్ర అత్యంత కీలకమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వార్డులు, డివిజన్లలో మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం, రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. నూతన పురపాలక పాలకవర్గాలు సమన్వయంతో పనిచేసి ప్రజల ఆశలను నెరవేర్చాలని ఆకాంక్షించారు.

ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి)

ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలకు నూతనంగా ఎన్నికైన మేయర్‌లు, చైర్మన్లు, డిప్యూటీ మేయర్‌లు, వైస్ చైర్మన్లు అలాగే ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఈ నూతన సారథులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణాల అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.

కొత్తగూడెం కార్పొరేషన్‌కు తొలి మేయర్

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన మూడ్ గణేష్ (సీపీఐ), డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన సిరిపురపు లలిత (కాంగ్రెస్)లకు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రజా సంక్షేమం, పట్టణ అభివృద్ధి దిశగా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.

జిల్లావ్యాప్తంగా ఎన్నికైన చైర్మన్లకు అభినందనలు

అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లకు మంత్రి అభినందనలు తెలిపారు.

మధిర మున్సిపల్ చైర్మన్ సామినేని సుజాత, వైస్ చైర్మన్ కోట ధనమూర్తి

సత్తుపల్లి చైర్మన్ రెహానా బేగం, వైస్ చైర్మన్ బొంతు సుమలత

వైరా చైర్మన్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్

అశ్వారావుపేట చైర్మన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్

ఎదులాపురం చైర్మన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్

కల్లూరు చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్, వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరి
వారందరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆదర్శవంతమైన పాలన అందించాలని మంత్రి సూచించారు.

పూర్తి పాలకవర్గాల సమన్వయం కీలకం

పట్టణాల్లోని ప్రతి వార్డు, డివిజన్ అభివృద్ధి చెందాలంటే కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో కూడిన పూర్తి పాలకవర్గం పాత్ర అత్యంత కీలకమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వార్డులు, డివిజన్లలో మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం, రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. నూతన పురపాలక పాలకవర్గాలు సమన్వయంతో పనిచేసి ప్రజల ఆశలను నెరవేర్చాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.