ఓబులువారిపల్లి మండలం గద్దలరేవుపల్లి గ్రామం చిట్వేల్ రోడ్ దారిలో ఏర్పాటు చేసిన “కిసాన్ స్మార్ట్” స్టోర్‌ను *రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జి మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.డాక్టర్ వెంకటేశ్వర్లు ఏదోటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కిసాన్ స్మార్ట్ స్టోర్ మరియు యాప్ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా రైతులు తమకు అవసరమైన వ్యవసాయ పరికరాలు, విత్తనాలు, ఎరువులు, మరియు పంటల మార్కెట్ ధరల సమాచారాన్ని సులభంగా పొందగలరు.ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ రైతుల అభివృద్ధి, సాంకేతిక ప్రగతి లక్ష్యంగా తీసుకున్న ఈ కొత్త ప్రయత్నం గ్రామీణ వ్యవసాయ రంగానికి దోహదం చేస్తుంది. అన్ని రంగాలతో పాటు వ్యవసాయ రంగంలో కూడా టెక్నాలజీ అభివృద్ధి చెందడం రైతులకు ఎంతో మేలు చేస్తుంది. ఇటువంటి వినూత్నమైన సేవలు అందిస్తుంది డాక్టర్ వెంకటేశ్వర్లు వంటి ఔత్సాహికుల అవసరం ప్రస్తుత సమాజానికి ఎంతో ఉంది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చిట్వేల్, ఓబుళవారిపల్లి, రైల్వే కోడూరు నియోజకవర్గాల కూటమి నాయకులు, రైతులు, మరియు స్థానిక ప్రజలు పాల్గొని కిసాన్ స్మార్ట్ ప్రారంభాన్ని స్వాగతించారు.

నూతన కిసాన్ స్మార్ట్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ముక్కా వరలక్ష్మి