నందలూరు మండలం నూకనేనిపల్లి గ్రామపంచాయతీలో ఈరోజు యువత మరియు గ్రామ ప్రజలు భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరారు. బిజెపి జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు సాయి లోకేష్ సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ముఖ్యఅతిథిగా విచ్చేసి, పార్టీలో చేరిన వారికి కాషాయ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై యువత పెద్ద సంఖ్యలో బిజెపిలో చేరడం శుభపరిణామమని పేర్కొన్నారు.
పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ మోర్చా నాయకుడు షబిర్ అహ్మద్, జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ యాదవ్, జిల్లా కార్యదర్శి నరేంద్ర రాజు, జిల్లా డైరెక్టర్ విఠలాచారి, అసెంబ్లీ కో కన్వీనర్ డాక్టర్ అరిగే రామ్ ప్రసాద్ పాల్గొన్నారు.
అలాగే సీనియర్ నాయకుడు కోడురా ఆదినారాయణ, మున్సిపల్ కౌన్సలర్ వర్మ, మండల అధ్యక్షుడు చుక్కా శ్రీనివాసులు మరియు నందలూరు బిజెపి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.



