Tuesday, 24 March 2026
  • Home  
  • నుచ్చుపొద గ్రామంలో ఘనంగా సంక్రాంతి క్రీడా సంబరాలు:
- ప్రకాశం

నుచ్చుపొద గ్రామంలో ఘనంగా సంక్రాంతి క్రీడా సంబరాలు:

పామూరు జనవరి ( పున్నమి ప్రతి నిధి) సంక్రాంతి సంబరాల్లో భాగంగా పామూరు మండలం నుచ్చుపొద గ్రామపంచాయతీలో స్వామి వివేకానంద యువ చైతన్య ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఆరెకొండ సురేష్ బాబు అధ్యక్షత వహించగా, మెడబలిమి శ్రీహరి ఆధ్వర్యంలో క్రికెట్, కబడ్డీ, రన్నింగ్ రేసులు, లెమన్ స్పూన్స్, మ్యూజికల్ చైర్స్ తదితర ఆటలు నిర్వహించబడాయి. ఆటల అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ ఉపసర్పంచ్ గొల్ల వెంకటేశ్వర్లు, పోకా లోకనాథం పాల్గొని మాట్లాడారు. యువతకు క్రీడలు ఎంతో అవసరమని, ఇవి గ్రామంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు శరీర దేహదారుఢ్యానికి ఉపయోగపడతాయని తెలిపారు. గత 13 సంవత్సరాలుగా గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పటికప్పుడు ప్రోత్సాహం అందిస్తున్న పోకా లోకనాథం, ఉపసర్పంచ్ గొల్ల వెంకటేశ్వర్లు, ఆరెకొండ హరిప్రసాద్, కోలనీడి రామకృష్ణ, శ్రీహరి, హనుమంతు ల సహకారం అమూల్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోలనీడి రామకృష్ణ, ఆరెకొండ హరిప్రసాద్, కందుల మాల్యాద్రి, కవులూరి చిన్న కాశం, సుత్తినేని రమణయ్య, హనుమంతు, రాము, వెంకీ, రాజశేఖర్, రామచంద్ర, ప్రవీణ్‌తో పాటు గ్రామంలోని పిల్లలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పామూరు జనవరి
( పున్నమి ప్రతి నిధి)

సంక్రాంతి సంబరాల్లో భాగంగా పామూరు మండలం నుచ్చుపొద గ్రామపంచాయతీలో స్వామి వివేకానంద యువ చైతన్య ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఆరెకొండ సురేష్ బాబు అధ్యక్షత వహించగా, మెడబలిమి శ్రీహరి ఆధ్వర్యంలో క్రికెట్, కబడ్డీ, రన్నింగ్ రేసులు, లెమన్ స్పూన్స్, మ్యూజికల్ చైర్స్ తదితర ఆటలు నిర్వహించబడాయి.

ఆటల అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ ఉపసర్పంచ్ గొల్ల వెంకటేశ్వర్లు, పోకా లోకనాథం పాల్గొని మాట్లాడారు. యువతకు క్రీడలు ఎంతో అవసరమని, ఇవి గ్రామంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు శరీర దేహదారుఢ్యానికి ఉపయోగపడతాయని తెలిపారు. గత 13 సంవత్సరాలుగా గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పటికప్పుడు ప్రోత్సాహం అందిస్తున్న పోకా లోకనాథం, ఉపసర్పంచ్ గొల్ల వెంకటేశ్వర్లు, ఆరెకొండ హరిప్రసాద్, కోలనీడి రామకృష్ణ, శ్రీహరి, హనుమంతు ల సహకారం అమూల్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కోలనీడి రామకృష్ణ, ఆరెకొండ హరిప్రసాద్, కందుల మాల్యాద్రి, కవులూరి చిన్న కాశం, సుత్తినేని రమణయ్య, హనుమంతు, రాము, వెంకీ, రాజశేఖర్, రామచంద్ర, ప్రవీణ్‌తో పాటు గ్రామంలోని పిల్లలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.