Thursday, 26 March 2026
  • Home  
  • నీలకంఠేశ్వర స్వామివారి ఆరుద్ర నక్షత్ర పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
- తిరుపతి

నీలకంఠేశ్వర స్వామివారి ఆరుద్ర నక్షత్ర పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి, మార్చి 26 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండల పరిధిలోని ఊరందూరు గ్రామంలో వెలసిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన ఇక్కడకు స్వామి, అమ్మవార్లు విచ్చేసిన పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆయన సతీమణి రిషిత రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయం వెలుపల స్వామివారికి ఎదురు సేవగా వెళ్లిన ఎమ్మెల్యే దంపతులు, స్వామి-అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో జరిగిన శాంతి అభిషేకం, అన్నదాన కార్యక్రమాల్లో వారు పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆ పరమశివుని ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.