సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి)
ఏపీ ప్రభుత్వం అమరావతి సమీపంలోని నీరుకొండ కొండపై 300 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించనున్నది. మొత్తం 600 అడుగుల ఎత్తుకు గల ఈ ప్రాజెక్టులో, 100 అడుగుల బేస్‌పై 200 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. బేస్‌లో మ్యూజియం, మినీ థియేటర్, కన్వెన్షన్ సెంటర్‌లు నిర్మించనున్నారని అధికారులు తెలిపారు. సందర్శకుల సౌకర్యార్థం ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు ఏర్పాటు చేయనున్నారు. విగ్రహ నిర్మాణానికి సంబంధించి విశదమైన ప్రాజెక్ట్ నివేదిక (DPR) సిద్ధం చేయడానికి టెండర్లను ఇప్పటికే ఆహ్వానించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విగ్రహం భవిష్యత్తులో ముఖ్యమైన పర్యాటక ఆకర్షణగా మారనుంది.


