Thursday, 12 February 2026
  • Home  
  • నీరా ప్రాజెక్ట్ అమలు చేయాలి.. ప్రభుత్వానికి విజ్ఞప్తి ..చేసిన ఏత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంగటి రాము.
- విశాఖపట్నం

నీరా ప్రాజెక్ట్ అమలు చేయాలి.. ప్రభుత్వానికి విజ్ఞప్తి ..చేసిన ఏత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంగటి రాము.

నీరా ప్రాజెక్ట్ అమలు చేయాలి.. ప్రభుత్వానికి విజ్ఞప్తి ..చేసిన ఏత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంగటి రాము. విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి:- నీరా ప్రాజెక్టును అమలు చేయాలని ఏత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంగటి రాము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.నీరా పథకాన్ని అమలు చేస్తే కొబ్బరి , తాటి రైతులకు, ఆర్థికంగా తోడ్పాటుకలుగుతుందన్నారు.విశాఖలో గీత కులాల ఐక్య వేదిక అద్వర్యం లో ముడ సర్లోవ లో “వన సమారాధన” నిర్వహించారు. రాజకీయ, ఆర్ధిక, సామాజిక అభివృద్దే లక్ష్యం గా నిర్వహించిన వన సమారాధన లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐదు కులాలకు చెందిన (శెట్టి బలిజ, యాత, గౌడ, శ్రీ శయన, ఈడీగ ) వారంతా పెద్దఎత్తున హాజరయ్యారు.అంతకు ముందు భీమిలి నియజక వర్గం ఆనంద పురం నుంచి ముడసర్లోవ వరకు సుమారు 25 కిలోమీటర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. బస్సులు,కార్లు,ఆటోలు, బైక్ లతో వేలాది మంది వన సమారాధన- ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొనేందుకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఏత సంక్షేమ సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంగటి రాము మాట్లాడుతూ గీత కులస్తులు ఆర్థికంగ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారన్నారు.గీత కార్మికులకు పెంక్షన్ విధానాన్ని అమలు చేయలని ప్రభుత్వాన్ని కోరారు.మత్స్య కారులకు అమలు చేసిన విధంగా గీత కార్మికులకు ప్రమాద బీమా ప్రకటించాలని, ప్రమాద వశాత్తు మరణిస్తే 10 లక్షలు, అంగవైకల్యం చెందితే 5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.అలాగే గీత కార్మికులకు వృత్తి విరామ సమయం లో జీవన భృతి కల్పించాలన్నారు. ఐక్యతే మా లక్ష్యం.. ఆంధ్ర ప్రదేశ్ గీత కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస్.. ఆంధ్ర ప్రదేశ్ గీత కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస్..మాట్లాడుతూ ఆర్థికం గా వెనుకబడిన గీత కార్మికులను పూర్తి స్థాయిలో ప్రభుత్వం గుర్తించాలని,ఆర్ధిక సామాజిక ,రాజకీయరంగాల్లో యాత,శ్రీ శయన, శెట్టి బలిజ,గౌడ, ఈడీగా కులస్తులకు ప్రాధాన్యత కల్పించాలనికోరారు. విశాఖలో నిర్వహించిన వన సమారాధన – ఆత్మీయ కలయిక తమ కులాల ఐక్యత ను సమాజానికి తెలియజేయల్లన్నదే ముఖ్య ఉద్దేశం అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఈడీగా సంఘం అధ్యక్షుడు ఈడీగా వేణు గోపాల్,రాష్ట్ర బీసీ సమాఖ్య అధ్యక్షుడు గుబ్బల బాబ్జి, గౌడ సంఘం నాయకుడు పామర్తి జయ ప్రకాష్,తో బాటు భీమిలి నియజక వర్గం లోని వివిధ మండలాలనుంచి గీత కులానికి చెందిన నాయకులు, మహిళలు హాజరయ్యారు.

నీరా ప్రాజెక్ట్ అమలు చేయాలి..
ప్రభుత్వానికి విజ్ఞప్తి ..చేసిన ఏత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంగటి రాము.
విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి:-

నీరా ప్రాజెక్టును అమలు చేయాలని ఏత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంగటి రాము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.నీరా పథకాన్ని అమలు చేస్తే కొబ్బరి , తాటి రైతులకు, ఆర్థికంగా తోడ్పాటుకలుగుతుందన్నారు.విశాఖలో గీత కులాల ఐక్య వేదిక అద్వర్యం లో ముడ సర్లోవ లో
“వన సమారాధన” నిర్వహించారు. రాజకీయ, ఆర్ధిక, సామాజిక అభివృద్దే లక్ష్యం గా నిర్వహించిన వన సమారాధన లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐదు కులాలకు చెందిన (శెట్టి బలిజ, యాత, గౌడ, శ్రీ శయన, ఈడీగ ) వారంతా పెద్దఎత్తున హాజరయ్యారు.అంతకు ముందు భీమిలి నియజక వర్గం ఆనంద పురం నుంచి ముడసర్లోవ వరకు సుమారు 25 కిలోమీటర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. బస్సులు,కార్లు,ఆటోలు, బైక్ లతో వేలాది మంది వన సమారాధన- ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొనేందుకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఏత సంక్షేమ సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంగటి రాము మాట్లాడుతూ గీత కులస్తులు ఆర్థికంగ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారన్నారు.గీత కార్మికులకు పెంక్షన్ విధానాన్ని అమలు చేయలని ప్రభుత్వాన్ని కోరారు.మత్స్య కారులకు అమలు చేసిన విధంగా గీత కార్మికులకు ప్రమాద బీమా ప్రకటించాలని, ప్రమాద వశాత్తు మరణిస్తే 10 లక్షలు, అంగవైకల్యం చెందితే 5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.అలాగే గీత కార్మికులకు వృత్తి విరామ సమయం లో జీవన భృతి కల్పించాలన్నారు.

ఐక్యతే మా లక్ష్యం..

ఆంధ్ర ప్రదేశ్ గీత కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస్..

ఆంధ్ర ప్రదేశ్ గీత కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస్..మాట్లాడుతూ ఆర్థికం గా వెనుకబడిన గీత కార్మికులను పూర్తి స్థాయిలో ప్రభుత్వం గుర్తించాలని,ఆర్ధిక సామాజిక ,రాజకీయరంగాల్లో యాత,శ్రీ శయన, శెట్టి బలిజ,గౌడ, ఈడీగా కులస్తులకు ప్రాధాన్యత కల్పించాలనికోరారు. విశాఖలో నిర్వహించిన వన సమారాధన – ఆత్మీయ కలయిక తమ కులాల ఐక్యత ను సమాజానికి తెలియజేయల్లన్నదే ముఖ్య ఉద్దేశం అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఈడీగా సంఘం అధ్యక్షుడు ఈడీగా వేణు గోపాల్,రాష్ట్ర బీసీ సమాఖ్య అధ్యక్షుడు గుబ్బల బాబ్జి, గౌడ సంఘం నాయకుడు పామర్తి జయ ప్రకాష్,తో బాటు భీమిలి నియజక వర్గం లోని వివిధ మండలాలనుంచి గీత కులానికి చెందిన నాయకులు, మహిళలు హాజరయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.