Thursday, 5 February 2026
  • Home  
  • “నీతి నిలయ సమాజాన యోగివేమన” – డాక్టర్ బద్రి పీర్ కుమార్
- సాహితీ

“నీతి నిలయ సమాజాన యోగివేమన” – డాక్టర్ బద్రి పీర్ కుమార్

యోగిగా మారిన తర్వాత తన పద్యాలలో కేవలం నీతిని మాత్రమే కాక, సమాజంలోని మూఢనమ్మకాలు, కుల వివక్ష, మత మౌఢ్యంపై తీవ్రమైన విమర్శలు చేసిన ప్రజాకవి వేమన తన జీవితాంతం ప్రజల కోసమే జీవించారు. జనవరి 19వ తేదీన ఆయన 374వ జయంతి సందర్భంగా ‘నీతి నిలయ సమాజాన యోగివేమన – కవిత’ వేమన ఏమనె… ప్రకృతి సూత్రం పాటించమనె వైజ్ఞానికంగా అంతరాత్మను తెలుసుకోమనె భావోద్వేగాలు అదుపులో ఉంచుకోమనె సృష్టిని సమన్యాయ దృష్టితో చూడమనె జన్మనిచ్చిన వారిని సూర్యచంద్రులుగ భావించమనె తమ తప్పులు సరిదిద్దుకుని సన్మార్గం సాగించమనె. ప్రజా హృదయాన నిత్యం ఉదయించే అనుకరణ సూచన మానవత్వ మతంతో వ్యక్తిత్వాన్ని నవీకరించిన ఆలోచన పని పాటలు ప్రతిరోజు ప్రతిఫలించే అభివృద్ధి నివేదన నడవడి క్రమశిక్షణ ఒరవడి ఆచరణ మంచి మాటకి ఆయుష్షు విశ్లేషణ… విశ్వదాభిరామ వినురవేమ యోగివేమన సామాజిక ప్రేమ. జననం జీవనం దైవానుగ్రహ పరంపర పయనం పుష్పించిన తలంపు సుమాల విజ్ఞాన వనం గమనం సుగుణం అనుసంధాన భావకవనం నిత్య స్వానుభవాల సంతులన ప్రయోజనం. మానవ బుద్ధి సమృద్ధి సమ్మిళిత మార్గదర్శకం అల్పుడు సజ్జనుడు ప్రభావ పరివర్తన కాలసూచికం గుణముల గణనలో ఉపమానాంశాల మమేకం ప్రతి మాట సంక్షేమ హెచ్చరికల పద్య వాచకం. మానవజాతి మనుగడ గతికి శ్రేయోదాయకం ఉపమానాలతో ఉపయుక్తమైన వేమన శతకం. జీవితప్రమాణానికి వికాస ప్రయాణానికి నిలయం సాంఘిక క్షేత్రంలో సృజనాత్మక వ్యవసాయం ఇది ఫలదీకృత సరళీకృత జనజీవన ఆశయం మాటల మాలికలల్లిన మనోవిజ్ఞాన ఆశ్రయం సమాజ శ్రేయస్సుకు సందేశాత్మక ఆశీస్సుల అభయం సులక్షణ సంస్కరణల భావ ప్రకంపన ఆగమనాలయం నీతి నిలయ సమాజాన ఆలోచన ఆచరణ సద్వయం.. యోగివేమన పద్య సారాంశం

యోగిగా మారిన తర్వాత తన పద్యాలలో కేవలం నీతిని మాత్రమే కాక, సమాజంలోని మూఢనమ్మకాలు, కుల వివక్ష, మత మౌఢ్యంపై తీవ్రమైన విమర్శలు చేసిన ప్రజాకవి వేమన తన జీవితాంతం ప్రజల కోసమే జీవించారు. జనవరి 19వ తేదీన ఆయన 374వ జయంతి సందర్భంగా ‘నీతి నిలయ సమాజాన యోగివేమన – కవిత’

వేమన ఏమనె…
ప్రకృతి సూత్రం పాటించమనె
వైజ్ఞానికంగా అంతరాత్మను తెలుసుకోమనె
భావోద్వేగాలు అదుపులో ఉంచుకోమనె

సృష్టిని సమన్యాయ దృష్టితో చూడమనె
జన్మనిచ్చిన వారిని సూర్యచంద్రులుగ భావించమనె
తమ తప్పులు సరిదిద్దుకుని సన్మార్గం సాగించమనె.

ప్రజా హృదయాన నిత్యం ఉదయించే అనుకరణ సూచన
మానవత్వ మతంతో వ్యక్తిత్వాన్ని నవీకరించిన ఆలోచన
పని పాటలు ప్రతిరోజు ప్రతిఫలించే అభివృద్ధి నివేదన

నడవడి క్రమశిక్షణ ఒరవడి ఆచరణ
మంచి మాటకి ఆయుష్షు విశ్లేషణ…
విశ్వదాభిరామ వినురవేమ
యోగివేమన సామాజిక ప్రేమ.

జననం జీవనం దైవానుగ్రహ పరంపర పయనం
పుష్పించిన తలంపు సుమాల విజ్ఞాన వనం
గమనం సుగుణం అనుసంధాన భావకవనం
నిత్య స్వానుభవాల సంతులన ప్రయోజనం.

మానవ బుద్ధి సమృద్ధి సమ్మిళిత మార్గదర్శకం
అల్పుడు సజ్జనుడు ప్రభావ పరివర్తన కాలసూచికం
గుణముల గణనలో ఉపమానాంశాల మమేకం

ప్రతి మాట సంక్షేమ హెచ్చరికల పద్య వాచకం.
మానవజాతి మనుగడ గతికి శ్రేయోదాయకం
ఉపమానాలతో ఉపయుక్తమైన వేమన శతకం.

జీవితప్రమాణానికి వికాస ప్రయాణానికి నిలయం
సాంఘిక క్షేత్రంలో సృజనాత్మక వ్యవసాయం
ఇది ఫలదీకృత సరళీకృత జనజీవన ఆశయం

మాటల మాలికలల్లిన మనోవిజ్ఞాన ఆశ్రయం
సమాజ శ్రేయస్సుకు సందేశాత్మక ఆశీస్సుల అభయం
సులక్షణ సంస్కరణల భావ ప్రకంపన ఆగమనాలయం
నీతి నిలయ సమాజాన
ఆలోచన ఆచరణ సద్వయం.. యోగివేమన పద్య సారాంశం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.