Story highlights
- నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఉదయగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ రమేష్ కుమార్ పేర్కొన్నారు.
- బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయగిరి ఆర్టీసీ డిపోలో ఉద్యోగులతో గేట్ మీటింగ్ నిర్వహించారు.
- ఈ సందర్భంగా నీటి ప్రాముఖ్యత, వృథాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఉదయగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ రమేష్ కుమార్ పేర్కొన్నారు. బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయగిరి ఆర్టీసీ డిపోలో ఉద్యోగులతో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి ప్రాముఖ్యత, వృథాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం ఉద్యోగులందరితో బ్రిక్స్ ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో నీటిని పొదుపుగా వినియోగిస్తూ, పర్యావరణ పరిరక్షణకు దోహదపడే సుస్థిర జీవనశైలి విధానాలను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డిపో ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.