Sunday, 29 March 2026
  • Home  
  • నిస్వార్థ సమాజ సేవకులు పూర్ణ చంద్రారెడ్డి, పేదల గుండెల్లో ఆయన స్థాయి చిరస్మరణీయం
- తూర్పు గోదావరి

నిస్వార్థ సమాజ సేవకులు పూర్ణ చంద్రారెడ్డి, పేదల గుండెల్లో ఆయన స్థాయి చిరస్మరణీయం

నిస్వార్ధ సమాజ సేవకులు పూర్ణ చంద్రారెడ్డి – పేదల గుండెల్లో ఆయన స్థాయి చిరస్మరణీయం – ‘‘నాన్న ఆశయ సాధనే నా లక్ష్యం!’’ – ఆయన తనయుడు గొందేశి శ్రీనివాసులు రెడ్డి – పూర్ణ చంద్రారెడ్డి జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు – పేదలకు ఆర్ధిక సహాయం… 400 మందికి జ్యుట్ బ్యాగ్ లు పంపిణీ – వివిధ సంస్థల్లోని పేదలకు అన్నదానం జీవించి ఉన్నంత కాలంగా పేదలకు నిస్వార్ధంగా సేవ చేసిన తమ తండ్రి గొందేశి పూర్ణ చంద్రారెడ్డి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని ప్రముఖ న్యాయవాది, గొందేశి పూర్ణ చంద్రారెడ్డి తనయుడు గొందేశి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. తన తండ్రి 85వ జయంతిని పురస్కరించుకుని రాజమహేంద్రవరం రూరల్‌ మండలం బాలాజీపేటలోని తన తండ్రి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ తమ తండ్రి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరి గుండెల్లో ఆయన ఇంకా సజీవంగా ఉన్నారనడానికి ఇదే నిదర్శనమని శ్రీనివాసులు రెడ్డి అన్నారు. తన తండ్రి ఆశయసాధనే తన లక్ష్యమన్నారు. తన తండ్రి కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాదు, సేవకుడిగా, నిస్వార్థపరుడిగా, సామాన్య ప్రజల పక్షపాతిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. పదవుల కోసం, అధికారాల కోసం వెంపర్లాడకుండా… చివరి శ్వాస వరకు ఆయన ప్రజల మధ్యే జీవించారని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి, ముఖ్యంగా విద్యా, వైద్య రంగాలకు ఆయన అందించిన చేయూత ఎప్పటికీ మరువలేనివన్నారు. నేటి యువత, రాజకీయ నాయకులు ఆయన జీవితాన్ని ఒక పాఠంగా తీసుకోవాలని సూచించారు. ఆయన ఎప్పుడూ వ్యక్తిగత దూషణలకు తావివ్వకుండా, కేవలం ప్రజల సమస్యలపైనే దృష్టి పెట్టేవారని, ఆయన చూపిన మార్గంలో నడిచి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తన జీవిత ధ్యేయమన్నారు. అనంతరం శ్రీనివాసులురెడ్డి ఒక పేద విద్యార్ధినికి చదువు నిమిత్తం అలాగే ఇద్దరు పేదలకు ఆర్ధిక సహాయం అందించారు. 400 మందికి జ్యుట్ బ్యాగ్ లు పంపిణీ, వివిధ సంస్థల్లో అన్నదానం నిర్వహించారు. కాగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆయన అభిమానులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గొందేశి పూర్ణ చంద్రారెడ్డి తనయుడు, గొందేశి శ్రీనివాసులు రెడ్డి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ముందుగా, పూర్ణ చంద్రారెడ్డి విగ్రహానికి ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పలువురు వక్తలు ఆయన సేవలను, నిస్వార్థ రాజకీయ జీవితాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువ నేత జక్కంపూడి గణేష్‌, రాయుడు ప్రసాద్‌, ఎన్‌ సుధాకర్‌, సూరంపూడి ప్రకాష్‌, పూడి ప్రకాష్‌, రెడ్డి ప్రసాద్‌, నగేష్‌, విజయానంద్‌, మురళి, సీతారాం చరణ్‌, కైఫ్‌ ఫ్రెండ్‌ సర్కిల్‌, రూపేష్‌ ఫ్రెండ్‌ సర్కిల్‌, ఓంప్రకాష్‌ ఫ్రెండ్‌ సర్కిల్‌, నాగేంద్ర, మరిడాపు శేఖర్‌, కాకులపార్టీ కుమార్‌, తడాలవిష్ణు చక్రవర్తి, తాటికొండ విష్ణు, ముత్యాల పోసి కుమార్‌, ఖాన్‌ భాయ్‌, నర్సింగ్‌ శ్రీను, సురేంద్ర, వంశీ, భీమశంకర్‌, మురళి, ముద్దాల తిరుపతిరావు (అను), నూకరాజు, కాకినాడ రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు, రూరల్‌ రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, కార్మిక నేతలు బాక్స్‌ ప్రసాద్‌, ఆటో యూనియన్‌ నాయకులు, కన్నా రెడ్డి, పెయింటర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు, వడ్రంగి అసోసియేషన్‌ సభ్యులు, ఆటో యూనియన్‌ నాయకులు, టెక్క హౌసెస్‌ యూనియన్‌ నాయకులు బాలాజీ పేట కనకదుర్గమ్మ తల్లి గుడి కమిటీ సభ్యులు, వెంకటేశ్వర నగర్‌ వెంకటేశ్వర స్వామి గుడి కమిటీ సభ్యులు, బాలాజీ పేట వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు, సమీరా ఎస్కే సత్తార్‌, జి ఎస్‌ ఆర్‌ ఫ్రెండ్స్‌ సర్కిల్‌ కేత నాగేశ్వరరావు, గిరిబాబు, న్యాయవాదుల సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు, నర్సింగ్‌ శ్రీను, ఆనంద్‌, మరక శ్రీను, శిల్పి శివ, అహ్మద్‌, దొంగ శ్రీను, ఎర్రం శెట్టి సునీల్‌, ఎంకన్న, పిలకపండు, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.

నిస్వార్ధ సమాజ సేవకులు పూర్ణ చంద్రారెడ్డి
– పేదల గుండెల్లో ఆయన స్థాయి చిరస్మరణీయం
– ‘‘నాన్న ఆశయ సాధనే నా లక్ష్యం!’’
– ఆయన తనయుడు గొందేశి శ్రీనివాసులు రెడ్డి
– పూర్ణ చంద్రారెడ్డి జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు
– పేదలకు ఆర్ధిక సహాయం… 400 మందికి జ్యుట్ బ్యాగ్ లు పంపిణీ
– వివిధ సంస్థల్లోని పేదలకు అన్నదానం

జీవించి ఉన్నంత కాలంగా పేదలకు నిస్వార్ధంగా సేవ చేసిన తమ తండ్రి గొందేశి పూర్ణ చంద్రారెడ్డి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని ప్రముఖ న్యాయవాది, గొందేశి పూర్ణ చంద్రారెడ్డి తనయుడు గొందేశి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. తన తండ్రి 85వ జయంతిని పురస్కరించుకుని రాజమహేంద్రవరం రూరల్‌ మండలం బాలాజీపేటలోని తన తండ్రి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ తమ తండ్రి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరి గుండెల్లో ఆయన ఇంకా సజీవంగా ఉన్నారనడానికి ఇదే నిదర్శనమని శ్రీనివాసులు రెడ్డి అన్నారు. తన తండ్రి ఆశయసాధనే తన లక్ష్యమన్నారు. తన తండ్రి కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాదు, సేవకుడిగా, నిస్వార్థపరుడిగా, సామాన్య ప్రజల పక్షపాతిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. పదవుల కోసం, అధికారాల కోసం వెంపర్లాడకుండా… చివరి శ్వాస వరకు ఆయన ప్రజల మధ్యే జీవించారని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి, ముఖ్యంగా విద్యా, వైద్య రంగాలకు ఆయన అందించిన చేయూత ఎప్పటికీ మరువలేనివన్నారు. నేటి యువత, రాజకీయ నాయకులు ఆయన జీవితాన్ని ఒక పాఠంగా తీసుకోవాలని సూచించారు. ఆయన ఎప్పుడూ వ్యక్తిగత దూషణలకు తావివ్వకుండా, కేవలం ప్రజల సమస్యలపైనే దృష్టి పెట్టేవారని, ఆయన చూపిన మార్గంలో నడిచి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తన జీవిత ధ్యేయమన్నారు. అనంతరం శ్రీనివాసులురెడ్డి ఒక పేద విద్యార్ధినికి చదువు నిమిత్తం అలాగే ఇద్దరు పేదలకు ఆర్ధిక సహాయం అందించారు. 400 మందికి జ్యుట్ బ్యాగ్ లు పంపిణీ, వివిధ సంస్థల్లో అన్నదానం నిర్వహించారు. కాగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆయన అభిమానులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గొందేశి పూర్ణ చంద్రారెడ్డి తనయుడు, గొందేశి శ్రీనివాసులు రెడ్డి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ముందుగా, పూర్ణ చంద్రారెడ్డి విగ్రహానికి ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పలువురు వక్తలు ఆయన సేవలను, నిస్వార్థ రాజకీయ జీవితాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువ నేత జక్కంపూడి గణేష్‌, రాయుడు ప్రసాద్‌, ఎన్‌ సుధాకర్‌, సూరంపూడి ప్రకాష్‌, పూడి ప్రకాష్‌, రెడ్డి ప్రసాద్‌, నగేష్‌, విజయానంద్‌, మురళి, సీతారాం చరణ్‌, కైఫ్‌ ఫ్రెండ్‌ సర్కిల్‌, రూపేష్‌ ఫ్రెండ్‌ సర్కిల్‌, ఓంప్రకాష్‌ ఫ్రెండ్‌ సర్కిల్‌, నాగేంద్ర, మరిడాపు శేఖర్‌, కాకులపార్టీ కుమార్‌, తడాలవిష్ణు చక్రవర్తి, తాటికొండ విష్ణు, ముత్యాల పోసి కుమార్‌, ఖాన్‌ భాయ్‌, నర్సింగ్‌ శ్రీను, సురేంద్ర, వంశీ, భీమశంకర్‌, మురళి, ముద్దాల తిరుపతిరావు (అను), నూకరాజు, కాకినాడ రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు, రూరల్‌ రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, కార్మిక నేతలు బాక్స్‌ ప్రసాద్‌, ఆటో యూనియన్‌ నాయకులు, కన్నా రెడ్డి, పెయింటర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు, వడ్రంగి అసోసియేషన్‌ సభ్యులు, ఆటో యూనియన్‌ నాయకులు, టెక్క హౌసెస్‌ యూనియన్‌ నాయకులు బాలాజీ పేట కనకదుర్గమ్మ తల్లి గుడి కమిటీ సభ్యులు, వెంకటేశ్వర నగర్‌ వెంకటేశ్వర స్వామి గుడి కమిటీ సభ్యులు, బాలాజీ పేట వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు, సమీరా ఎస్కే సత్తార్‌, జి ఎస్‌ ఆర్‌ ఫ్రెండ్స్‌ సర్కిల్‌ కేత నాగేశ్వరరావు, గిరిబాబు, న్యాయవాదుల సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు, నర్సింగ్‌ శ్రీను, ఆనంద్‌, మరక శ్రీను, శిల్పి శివ, అహ్మద్‌, దొంగ శ్రీను, ఎర్రం శెట్టి సునీల్‌, ఎంకన్న, పిలకపండు, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.