సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ము,నుగోడు ప్రతినిధి,చౌటుప్పల్,అక్టోబర్15,(పున్నమి ప్రతినిధి):
నిషేధిత జాబితా నుంచి తమ భూములను తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్,ఆధ్వర్యంలో అల్లాపురం రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు బుధవారం వినతిపత్రం అందజేశారు.యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ పరిధిలోని సర్వేనెంబర్ 106,లో అల్లాపురం రైతులకు పట్టా భూములున్నాయని,2018లో రైతులకు పాస్ బుక్కులు ఇచ్చారని పేర్కొన్నారు.పట్టాదారు పాస్ బుక్కులు వచ్చి దాదాపు 8 సంవత్సరాలు అవుతున్నా,అవసరమైన రైతులు తమ భూములను అమ్ముకోవడానికి వీలు లేకుండా నిషేధిత జాబితాలో చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు.సర్వేనెంబర్ 106 ను పూర్తిస్థాయిలో సర్వే చేసి నిషేధిత జాబితా నుంచి తొలగించాలని విన్నవించారు.కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జ్ పబ్బు రాజు గౌడ్,అల్లాపురం తాజా మాజీ సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డి,మండల కాంగ్రెస్ నాయకుడు అర్ధ వెంకట్ రెడ్డి,ల ఆధ్వర్యంలో అల్లాపురం గ్రామ రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్ హనుమంతరావును కలిసి వినతిపత్రం అందజేశారు.అదేవిధంగా ఏడి,ఆర్డీవోలకు వినతి పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు స్పందిస్తూ రాచకొండ పరిధిలోని సర్వేనెంబర్ 106 ను సర్వే నెంబర్ ను పూర్తిస్థాయిలో సర్వే చేయించి,రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.వినతి పత్రం అందజేసిన వాళ్ళు అల్లాపురం గ్రామ రైతులు వరకాంతం రవీందర్ రెడ్డి,ముత్యాల కృష్ణారెడ్డి,సింగిరెడ్డి మహిపాల్ రెడ్డి,సింగిరెడ్డి జంగారెడ్డి,సుర్కంటి శ్రీనివాస్ రెడ్డి,ముత్యాల ప్రతాపరెడ్డి,భూతం లింగస్వామి,భూతం యాదయ్య,బొడ్డు జంగయ్య,తదితరులున్నారు.


