నిర్మల్ అక్టోబర్ 05 (పున్నమి ప్రతినిధి)
నిర్మల్ జిల్లా: నిర్మల్ లోని ప్రియదర్శిని నగర్, సాగర్ కాలనీ లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ వేడుకల్లో చివరిరోజైన సద్దుల బతుకమ్మ వేడుకలు శనివారం రోజు మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా మహిళలు, యువతులు అంతా ఒక్కచోట చేరి ఆడిపాడుతూ సంబరాలు చేసుకున్నారు. మహిళలంతా తీరొక్క పువ్వులతో అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చారు. గౌరమ్మను పూజిస్తూ సంబురాలు జరుపుకొని అనంతరం బతుకమ్మను నిమజ్జనం చేశారు.


