నిరుపేద దళిత గిరిజనులకు ఇంటిస్థలం, సాగుకు భూమి అందిస్తాం
ఎమ్మార్వో కే అమర్నాథ్.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 04 (పున్నమి న్యూస్ ప్రతినిధి – సింగమాల వెంకటేష్):
నవంబర్ 4 మంగళవారం నాడు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మాధవరం పోడు అరుంధతి వాడ గ్రామాలలో రైల్వే కోడూరు మండల రెవెన్యూ తహసిల్దార్ అమర్నాథ్, వీఆర్వో దర్బార్, మండల సర్వేర్ సుబ్బరాయుడు విలేజ్ సర్వే లు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ పండుగోల మణి , భారత కమ్యూనిస్టు పార్టీ(సీ పి ఐ) రైల్వే కోడూరు మండల కార్యదర్శి కామ్రేడ్ దార్ల రాజశేఖర్ కబ్జాకు గురి అయిన స్మశాన వాటికను, పరిశీలించారు ఈ సందర్భంగా తహసిల్దార్ అమర్నాథ్ మాట్లాడుతూ కబ్జాకు గురి అయిన స్మశానాన్ని తక్షణమే సర్వే చేసి రోడ్డు కూడా ఏర్పాటు చేస్తామని, అంతేకాకుండా అరుంధతి వాడలలో ఉన్న సమస్యలు వీధి రోడ్లు, వీధిలైట్లు, త్రాగునీటిని విద్యుత్ సౌకర్యం పరిష్కారం చేయడానికి ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం ముందుంటుందని ఆయన అన్నారు, అంతేకాకుండా అరుంధవాడ నివాసులకు భూమిలేని నిరుపేదలుగా ఉన్నవారికి ప్రతి కుటుంబానికి ఇండ్ల స్థలంతో పాటు, కాలనీలు కట్టించి ప్రతి కుటుంబానికి రెండు ఎకరాలు ప్రభుత్వ భూమిని సిఫార సు చేయడానికి రెవెన్యూ యంత్రాంగం పనిచేస్తుందని ఆయన అరుంధతి వాడ నివాసులకు హామీ ఇచ్చారు, తక్షణమే రేషన్ కార్డులో రెండు మూడు కుటుంబాల ఉన్నవారు విడిగా రేషన్ కార్డులు తయారు చేసుకోవాలని, అంతే కాకుండా వికలాంగులు ఎవరైనా ఉంటే సదరం సర్టిఫికెట్లు తీసుకొని, పెన్షన్ రాని వారికీ ఎండిఓతో మాట్లాడి పెన్షన్లు మంజూరు చేయిస్తామని ఎమ్మార్వో కే అమర్నాథ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కామ్రేడ్ పండు గోల మణి, కామ్రేడ్ దార్ల రాజశేఖర్ మాట్లాడుతూ కేవలం హామీలకే పరిమితం కాకుండా సాధ్యమైనంత అనేక ఇబ్బందులతో సతమతమవుతున్న దళిత వాడకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కారం చేయాలని, భూమిలేని నిరుపేదలకు ప్రతి కుటుంబానికి రెండు ఎకరాలు ప్రభుత్వ భూమి ఇచ్చి మూడు సెంట్లు ఇంటి స్థలం కేటాయించి కాలనీలు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల మూడవ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మాధవరంపాడు నివాసులు సిపిఐ నాయకులు తహసిల్దార్ కి వినతి పత్రం ఇచ్చిన వెంటనే స్పందించి తహసిల్దార్ అమర్నాథ్ కి దళిత వాడకు వచ్చి వారి సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినందుకు ప్రత్యేకంగా సిపిఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బి కే ఎం యు మరియు దళితులు తరఫున తాసిల్దార్ కు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రేణుక, ప్రజావతి, లక్ష్మీదేవి, వెంకటమ్మ, సుబ్బమ్మ, నారాయణమ్మ, పెంచలమ్మ, కళ్యాణి వీరితోపాటు అరుంధతి వాడ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..


