Monday, 23 March 2026
  • Home  
  • నిమ్మ రైతులను ముంచిన మొంతా తుఫాన్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నిమ్మ రైతులను ముంచిన మొంతా తుఫాన్

అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలంలోని నిమ్మ రైతులను మాంథా తుఫాన్ నిలువునా ముంచేసింది. తుఫాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు నిమ్మ చెట్లు వేరులతో సహా కొన్నిచోట్ల పైకి లేచాయి. నిమ్మచెట్ల పూత, పిందె మొత్తం రాలిపోయాయి. అధిక వేగంతో వీచిన ఈదురు గాలులకు చాలా చెట్లు నేలవాలాయి. ఈ తుఫాను ప్రభావంతో నిమ్మ పూత,పిందెలు రాలిపోవడంతో నిమ్మ రైతులు కుదేలయ్యారు. ఎన్నో ఏళ్ళుగా సాగు చేసిన నిమ్మ చెట్లు తుఫాను ప్రభాతంతో నేల మట్టం కావడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయ్యింది. రైతులను ప్రభుత్వం వెంటనే అన్ని విధాల ఆదుకోవాలని నిమ్మరైతులు కోరుతున్నారు.

అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి)

చేజర్ల మండలంలోని నిమ్మ రైతులను మాంథా తుఫాన్ నిలువునా ముంచేసింది. తుఫాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు నిమ్మ చెట్లు వేరులతో సహా కొన్నిచోట్ల పైకి లేచాయి. నిమ్మచెట్ల పూత, పిందె మొత్తం రాలిపోయాయి. అధిక వేగంతో వీచిన ఈదురు గాలులకు చాలా చెట్లు నేలవాలాయి. ఈ తుఫాను ప్రభావంతో నిమ్మ పూత,పిందెలు రాలిపోవడంతో నిమ్మ రైతులు కుదేలయ్యారు. ఎన్నో ఏళ్ళుగా సాగు చేసిన నిమ్మ చెట్లు తుఫాను ప్రభాతంతో నేల మట్టం కావడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయ్యింది. రైతులను ప్రభుత్వం వెంటనే అన్ని విధాల ఆదుకోవాలని నిమ్మరైతులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.