- కరోనా వైరస్ దేశమునుండి వెళ్ళేదాకా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ.
వైయస్సార్ సిపి నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి.
నెల్లూరు జిల్లా నాయుడుపేట
వైయస్సార్ సిపి నాయకుడు కామిరెడ్డి రాజారెడ్డి ఆధ్వర్యంలో మర్లపల్లి గ్రామాo తదితర గ్రామాల్లో ముమ్మరంగా ప్రతి కుటుంబానికి నిత్యవసర సరుకులు కూరగాయలు ను పంపిణీ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సందర్భంగా పనులకు పొకుండా ఇంటికే పరిమితమై ఉండి ఆకలితో అలమటిస్తున్న వారు గ్రామాల్లో చాలా మంది పేదలు ఉన్నారని తెలుసుకుని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మర్లపల్లి,మర్లపల్లి మిట్టా, హరిజనవాడ,నరసారెడ్డి కండ్రిగ, పెరిగిలపాటి కండ్రిగ గ్రామాలలో సులూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పిలుపుతో సుమారు 250 కుటుంబాలకు ఎటువంటి డోకా లేకుండా నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు రాజారెడ్డి తెలిపారు,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దొప్పల చంద్రశేఖర్,రవి కుమార్, అశోక్ ,వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు.


