Monday, 8 December 2025
  • Home  
  • నావూరు పెద్దవాగును పరిశీలించిన కాకాణి…*
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నావూరు పెద్దవాగును పరిశీలించిన కాకాణి…*

*మొంథా తుఫాన్ నేపథ్యంలో…* *నావూరు పెద్దవాగును పరిశీలించిన కాకాణి…* *భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు…* పున్నమి ప్రతినిధి అక్టోబర్ 29(పొదలకూరు) మండలంలోని నావూరు పెద్దవాగును బుధవారం మాజీ మంత్రి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ మొంథా తుఫాన్ నేపథ్యంలో తాను నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా ఈరోజు నావూరు పెద్దవాగును పరిశీలించడం జరిగిందన్నారు. వర్షాకాలం వస్తే నావూరు, చెన్నారెడ్డిపల్లి, బోగసముద్రం, కొండలరాయుడు కండ్రిగ గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోతారని అన్నారు. చిన్నపాటి వర్షానికే పెద్దవాగు పొంగి రాకపోకలకు అంతరాయం కలుగుతుండడంతో ఈ గ్రామాల ప్రజలు తరతరాలుగా క్షోభను అనుభవిస్తున్నారని అన్నారు. వారి పరిస్థితిని గమనించిన తాను మంత్రిగా 2023లో పెద్దవాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణానికి మూడు కోట్ల 62 లక్షలు మంజూరు చేయించానని చెప్పారు. మూడు నెలల నుంచి ఐదు నెలల లోపల పూర్తి కావలసిన ఈ బ్రిడ్జి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర సంవత్సరమైనా ఇప్పటికీ అసంపూర్తిగా ఉందంటే అది ప్రస్తుత పాలకుల అసమర్థత, చేతకానితనం కాదా అని ప్రశ్నించారు. తాను అధికారంలో ఉన్నా, లేకున్నా 24/7 ప్రజా సమస్యలపై పోరాటం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బచ్చల సురేష్ కుమార్ రెడ్డి, మందల వెంకటశేషయ్య, రావుల ఇంద్రసేన్ గౌడ్, గోగిరెడ్డి గోపాల్ రెడ్డి,వాకాటి శ్రీనివాసులు రెడ్ది, మద్దిరెడ్డి రమణారెడ్డి, షేక్ అంజాద్, దాదిబత్తిన విజయభాస్కర్ రెడ్డి, నరసింహులు నాయుడు, కాకు పెంచలయ్య, చొప్ప రమేష్, కట్టా పెంచల భాస్కర్, వేణుగోపాల్ రెడ్ది తదితరులు పాల్గొన్నారు.

*మొంథా తుఫాన్ నేపథ్యంలో…*

*నావూరు పెద్దవాగును పరిశీలించిన కాకాణి…*

*భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు…*

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 29(పొదలకూరు)

మండలంలోని నావూరు పెద్దవాగును బుధవారం మాజీ మంత్రి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ మొంథా తుఫాన్ నేపథ్యంలో తాను నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా ఈరోజు నావూరు పెద్దవాగును పరిశీలించడం జరిగిందన్నారు. వర్షాకాలం వస్తే నావూరు, చెన్నారెడ్డిపల్లి, బోగసముద్రం, కొండలరాయుడు కండ్రిగ గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోతారని అన్నారు. చిన్నపాటి వర్షానికే పెద్దవాగు పొంగి రాకపోకలకు అంతరాయం కలుగుతుండడంతో ఈ గ్రామాల ప్రజలు తరతరాలుగా క్షోభను అనుభవిస్తున్నారని అన్నారు. వారి పరిస్థితిని గమనించిన తాను మంత్రిగా 2023లో పెద్దవాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణానికి మూడు కోట్ల 62 లక్షలు మంజూరు చేయించానని చెప్పారు. మూడు నెలల నుంచి ఐదు నెలల లోపల పూర్తి కావలసిన ఈ బ్రిడ్జి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర సంవత్సరమైనా ఇప్పటికీ అసంపూర్తిగా ఉందంటే అది ప్రస్తుత పాలకుల అసమర్థత, చేతకానితనం కాదా అని ప్రశ్నించారు. తాను అధికారంలో ఉన్నా, లేకున్నా 24/7 ప్రజా సమస్యలపై పోరాటం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బచ్చల సురేష్ కుమార్ రెడ్డి, మందల వెంకటశేషయ్య, రావుల ఇంద్రసేన్ గౌడ్, గోగిరెడ్డి గోపాల్ రెడ్డి,వాకాటి శ్రీనివాసులు రెడ్ది, మద్దిరెడ్డి రమణారెడ్డి, షేక్ అంజాద్, దాదిబత్తిన విజయభాస్కర్ రెడ్డి, నరసింహులు నాయుడు, కాకు పెంచలయ్య, చొప్ప రమేష్, కట్టా పెంచల భాస్కర్, వేణుగోపాల్ రెడ్ది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.