
నారాయణఖేడ్ పట్టణంలోని TG సాంఘిక సంక్షేమ గురుకుల
బాలుర కళాశాల ఇంటర్ మొదటి సంవత్సరంలో
ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి 31న స్పాట్ అడ్మిషన్లు
నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ లింగారెడ్డి మంగళవారం
తెలిపారు. స్థానికంగా ఎంపీసీ, బైపీసీలో ప్రవేశం
పొందేందుకు విద్యార్థులు తమ అర్హత గల ఒరిజినల్
ధ్రువపత్రాలతో గురువారం హాజరు కావాలన్నారు.
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు దరఖాస్తులు
స్వీకరిస్తామన్నారు.

