
నారాయణఖేడ్ పట్టణ ప్రాంతంలోని గిరిజన గురుకుల
కళాశాలను నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా భారతి గారు
ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా
కళాశాలలోని కిచెన్ రూమ్, స్టాక్ రూమ్, తరగతి
గదులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో
కలిసి అల్పాహారం లో పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్
యాదగిరితో మాట్లాడుతూ.. కళాశాలలోని వసతులను
గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయ బృందం
పాల్గొన్నారు.

