పున్నమి ఫిబ్రవరి
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా ఇంచార్జి
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారథి నారపరాజు రామచంద్ర రావు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆదివారం తీవ్ర నిరసన వ్యక్తమైంది. బాన్సువాడ, కామారెడ్డి ప్రాంతాల్లో బీజేపీ మరియు హిందూ నాయకులపై నమోదైన కేసులు, అరెస్టులను వ్యతిరేకిస్తూ పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వాసు దేవా రావు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య హక్కులను అణచివేసే విధంగా జరుగుతున్న అరెస్టులు తగవని మండిపడ్డారు. రాజకీయ ప్రతీకారంతోనే నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రెస్ మీట్‌లో నల్గొండ జిల్లా ఇంచార్జ్ ఉదయ ప్రతాప్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్ రావు, సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం, జిల్లా ఉపాధ్యక్షులు రవి రాథోడ్, ఆఫీస్ సెక్రటరీ రవి గౌడ్, నాయకులు అల్లిక అంజయ్య, భద్రం, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
నాయకులు మాట్లాడుతూ, బాన్సువాడ–కామారెడ్డి ప్రాంతాల్లో హిందూ, బీజేపీ నాయకులపై జరుగుతున్న అరెస్టులు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.



