
పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ
నెల్లూరు:ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితులలో నాయీ బ్రాహ్మణులను ఆదుకోవాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వినుకొండ వెంకటేశ్వర్లు విజ్ఞాప్తి చేశారు.అభయహస్తం అధినేత డాక్టర్ చేరుకుపల్లి భాస్కర్ రెడ్డి,డాక్టర్ మధులత దాతృత్వంతో నాయీ బ్రాహ్మణ వృత్తిదారులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున నగదు అందించారు. ఈ కార్యక్రమంలో పాకాల లక్ష్మీ నారాయణ,చేరుకూరు శ్రీనివాసులు పాల్గొన్నారు.

