కామవరపు కోట, సెప్టెంబర్, (పున్నమి ప్రతినిధి)
ఏలూరు జిల్లా, కామర్ కోట మండలం కామవరపు కోటలో నాయకా కులస్తులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుతూ కొమరం భీమ్ నాయక కులస్తుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. కార్యక్రమాన్ని సంఘం ప్రెసిడెంట్ రాంబాబు, జనరల్ సెక్రటరీ గోధుమ మధుబాబు, ట్రెజరర్ మీనింగ్ నరసింహారావు నేతృత్వంలో చేపట్టారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులు టీవీఎస్ రాజు, మేనుగుల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మొత్తం 500 మంది నాయక ఎస్టీ కులస్తులు ఈ నిరాహార దీక్షలో పాల్గొని తమ వినతులను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.


