రాజన్న సిరిసిల్ల జిల్లా /మార్చి/ పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ మోడల్ స్కూల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు రాయబోతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే.టి.రామారావు (కేటీఆర్) గారి తరఫున “గిఫ్ట్ ఎ స్మైల్” కార్యక్రమం ద్వారా ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు కేటీఆర్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మవిశ్వాసంతో, ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నామాపూర్ శాఖ గ్రామ అధ్యక్షులు తాడేపు అనిల్, ఉపాధ్యక్షులు ఆకారం బాలచంద్రు, ముచిప్పలపల్లి సర్పంచ్ మాచేటి లక్ష్మణ్, మాజీ సర్పంచ్ తాడేపు ఎల్లం, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కోమటి రాజమల్లు తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

