నాగుల చవితి భారతీయ సంస్కృతికి ప్రతీక
— డాక్టర్ కందుల నాగరాజు
*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
నాగుల చవితి భారతీయ సంస్కృతికి ప్రతీక అని
విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు.
నాగుల చవితి పండుగ సందర్భంగా పుట్టలో పాలు వేసి, పూజలు చేసి అందరూ బాగుండాలని ఆయన ప్రార్థించారు.
ప్రకృతిని ఆరాధించడం, జీవవైవిధ్యాన్ని గౌరవించడమని చెప్పారు. వ్యవసాయానికి సర్పాల సహాయాన్ని గుర్తించడాన్ని తెలియజేస్తుందన్నారు.
ఈ పండుగలో నాగులను నాగ దేవతలుగా, నాగరాజులుగా పూజించడం ద్వారా ప్రకృతిలోని ప్రతి అంగాన్ని, జీవులను దైవంగా చూసే హిందూ సంస్కృతిలోని లోతైన భావనను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, ప్రకృతితో మమేకమై జీవించే సంస్కృతిలో భాగమని తెలిపారు. ప్రకృతిని దైవంగా భావించే భారతీయ సంస్కృతిలో భాగంగా చెట్టు, పుట్ట, నది, పర్వతం వంటి వాటిని పూజిస్తారని వెల్లడించారు.
నాగులు పంటలను నాశనం చేసే కీటకాలను తిని, రైతులకు పరోక్షంగా సహాయపడతాయన్నారు. ఈ విధంగా, ప్రకృతికి, వ్యవసాయానికి సర్పాల సహకారాన్ని గుర్తించి, కృతజ్ఞత తెలియజేసే సంస్కృతిని ఇది సూచిస్తుందని అన్నారు. నాగులను దైవంగా పూజించడం ద్వారా, మానవులతో పాటు జీవకోటిలో ప్రతి ప్రాణికి ఒక ప్రత్యేక స్థానం ఉందని, వాటిని గౌరవించాలని ఈ పండుగ తెలియజేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో కందుల నలినీ దేవి,
కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


