లోక కల్యాణం కోసం ప్రార్థన: పీఠాధిపతి నాగేశ్వరమ్మ
చిట్వేల్/అక్టోబరు 25: పున్నమి ప్రతినిధి
నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని, శ్రీ శ్రీ శ్రీ దత్తగిరి నారాయణ తపోవన అభయ ఆంజనేయ స్వామి ఆశ్రమంలో శనివారం ప్రత్యేక పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతి శ్రీమతి నాగేశ్వరమ్మ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు కన్నుల పండువగా జరిగాయి.ఆలయంలోని నాగ దేవతలకు పాలు, పసుపు, కుంకుమ, నూకలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి నాగేశ్వరమ్మ మాట్లాడుతూ.. నాగుల చవితి రోజున నాగ దేవతలను ఆరాధించడం వల్ల సకల దోషాలు తొలగి, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని తెలిపారు. లోకంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పద్మాతమ్మ, వెంకటసుబ్బయ్య, చంద్రశేఖర్ తదితర ఆశ్రమంలోని పెద్దలు, పలువురు భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.


