(పున్నమి,న్యూస్)వింజమూరు సెప్టెంబర్ 21:////
ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు మండల బంగ్లా సెంటర్ దగ్గర ఉన్న హెచ్ పి పెట్రోల్ బంకు ఎదురుగా సుజాతనగర్ లో రావూరి రమణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నేను గత కొంతకాలం క్రితం మాకినేని మాల్యాద్రి భార్య అరుణమ్మల దగ్గర రావూరి రమణారెడ్డి ఒక్క లక్ష యాబై ఎనిమిది వేల రూపాయలకు 36 సంవత్సరాల క్రితం వారి దగ్గర సర్వే నెంబర్ 20061 బారు ఒకటి లో 33 సెంట్లు కొనుగోలు చేశాను అని ఆయన అన్నారు. 33 సెంట్లలో 29 సెంట్లు నా ఇంటి స్థలానికి ఉంచుకొని మూడు సెంట్లు స్థలాన్ని నేషనల్ రోడ్డు దగ్గర నుండి మా స్థలం చివరివరకు 19 అడుగుల వెడల్పుతో కూడిన దారి వదిలిపెట్టడం జరిగింది. సర్వేనెంబర్ 261-1లో నేను నా కుటుంబ సభ్యులు 30 సంవత్సరాలుగా ఈ స్థలంలో నివాసం ఉంటున్నాం కానీ ఇటీవల కాలంలో గత మూడు నాలుగు నెలలుగా వనిపెంట సుబ్బారెడ్డి మా స్థలమునకు ముందు ఉన్న స్థలం కొందూరి రత్నం అనే కాలేజ్ ప్రిన్సిపాల్ దగ్గర నేను కొన్నానని ఆయన చెబుతూ మేము దారి కొరకు విడిచిపెట్టిన దారి స్థలాన్ని వనిపెంట సుబ్బారెడ్డి ఆక్రమించి మేము ఇంట్లో నుంచి బయటకు రాకుండా ముళ్ళకంచ నాటించారు. నేను వెళ్లి మా స్థానంలో మీరెందుకు కంచి వేశారు నాటాల్సిన అవసరమేంటి ఈ స్థలం మాది నేను కొన్న స్థలం మా ఇంటికి దారి కొరకు వదులుకున్న స్థలాన్ని నువ్వు ఆక్రమించి అక్రమంగా ముళ్లకంచి వేయించడం ఏంటి అని నేను అడిగాను అడిగి వనిపెంట సుబ్బారెడ్డి నా దారిలో నాటిన ముళ్లకంచెను మా కుటుంబ సభ్యులతో కలసి వాటిని తొలగించే ప్రయత్నం చేయడం జరిగింది. అందుకు నామీదకు దాడికి దిగి అసభ్యకరమైన పదజాలంతో నన్ను దూషిస్తూ నేను కంచి వేసేది వేసేదే వేస్తాను కూడా నీ దిక్కున చోట చెప్పుకోమని ఆయనతోపాటు మరికొందరు నామీదకి దౌర్జన్యంగా దాడికి దిగి నన్ను కొట్టడం జరిగింది. ఇదిలా ఉండగా నేను రెండు రోజులు క్రితం వింజమూరు బంగ్లా సెంటర్లో టీ తాగడానికి వెళ్ళినప్పుడు వలిపెంట సుబ్బారెడ్డి వనిపెంట మాధవరెడ్డి వనిపెంట సురేష్ సాహిత్ అనే నలుగురు వారితో కూడా మరికొందరు కలిసి బంగ్లా సెంటర్లో టీ తాగుతున్న సమయంలో ఒక్కసారిగా నా మీద పడి దాడి చేసి నా చొక్కా చించి నన్ను కొట్టడం జరిగింది. ఈ విషయమై వింజమూరు పోలీసు వారికి నేను ఫిర్యాదు చేశాను పోలీసు వారు కేసు నమోదు చేశాము అని చెప్పారు. కానీ వారిని పిలిపించి మాట్లాడింది కానీ వారి వారిని అరెస్టు చేసినట్లుగాని ఎలాంటి దాఖలాలు లేవు మా మీదనే కేసు పెడతావా మాకు ఎదురు తిరుగుతావా నువ్వు ఎంత నీ బ్రతుకంతా నిన్ను చంపేస్తామంటూ వాళ్లు పబ్లిక్ గా మాట్లాడుతూ నన్ను నా కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వనిపెంట సుబ్బారెడ్డి వనిపెంట మాధవరెడ్డి వనిపెట్టా సురేష్ రెడ్డి సాహిత్ వీరి వలన నాకు ప్రాణహాని ఉందని నన్ను చంపేస్తాము అని వాళ్ళు తిరుగుతున్నారని రావూరి రమణారెడ్డి అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలని వారి చేతిలో నుండి నన్ను నా కుటుంబాన్ని కాపాడాలని ఆయన కోరారు ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్న నాకు న్యాయం చేయాలని నా కుటుంబానికి అండగా ఆయన ఉంటారని నేను ఆశిస్తున్నాను ఆయన సహాయం కోసం ఎదురుచూస్తున్నాను అధికారులు స్పందించి నాకు న్యాయం జరిగేలా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్న చేస్తారని పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఆయన సహాయం కోసం ఎదురుచూస్తున్నానని రావూరి రమణ రెడ్డి అన్నారు.


