పున్నమి ప్రతినిధి
జనహిత వాత్సల్య ఆశ్రమంలో 26-01-2026న భారతీయ విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, జివిఆర్‌ఆర్ జూనియర్ కాలేజ్ విద్యార్థులచే 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాత్సల్య ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవీ సాంబశివరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సింహపురి హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రమోటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాబోలు రామ సుబ్బయ్య జెండా ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ సి.ఎస్. శ్రీనివాస రాజు, చెన్నూరు వెంకటేశ్వర రెడ్డి పాల్గొని ప్రసంగించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమం చివరగా విద్యార్థులకు బహుమతులు, విద్యాభివృద్ధికి విరాళాలు అందజేశారు


