నకిరేకల్ : నవంబర్ (పున్నమి ప్రతినిధి )
యువత మత్తు పదార్థాల బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గౌతమి జూనియర్ కళాశాలలో పోలీస్, జిల్లా సంక్షేమశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మాదక ధ్రవ్యాల దుర్వినియోగం పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మత్తుమందులు, ఆల్కహాల్ వంటి చెడు వ్యసనాలకు యువత బానిసలు కావద్దని, ఇవి స్లో పాయిజన్ లాంటివని, ఒకసారి అలవాటైతే వదులుకోవడం కష్టమని, దీనివల్ల భవిష్యత్తు నాశనం అవుతుందని అన్నారు. నిషేధిత పదార్థాలను తీసుకోవడం తప్పు అని, జీవితం బాగుండాలంటే కష్టపడి చదువుకోవాలని, చదువు వదిలేసి, మత్తుమందులకు అలవాటు పడితే జీవితాంతం ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని అన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తారని, అందువల్ల క్రమశిక్షణతో, ఓపికగా చదువుకోవాలని, మంచి పౌరులుగా ఎదగాలని, చదువుతోపాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాల్సిన అవసరం ఉందని అన్నారు.

నషా ముక్త భారత్ :కలెక్టర్
నకిరేకల్ : నవంబర్ (పున్నమి ప్రతినిధి ) యువత మత్తు పదార్థాల బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గౌతమి జూనియర్ కళాశాలలో పోలీస్, జిల్లా సంక్షేమశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మాదక ధ్రవ్యాల దుర్వినియోగం పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మత్తుమందులు, ఆల్కహాల్ వంటి చెడు వ్యసనాలకు యువత బానిసలు కావద్దని, ఇవి స్లో పాయిజన్ లాంటివని, ఒకసారి అలవాటైతే వదులుకోవడం కష్టమని, దీనివల్ల భవిష్యత్తు నాశనం అవుతుందని అన్నారు. నిషేధిత పదార్థాలను తీసుకోవడం తప్పు అని, జీవితం బాగుండాలంటే కష్టపడి చదువుకోవాలని, చదువు వదిలేసి, మత్తుమందులకు అలవాటు పడితే జీవితాంతం ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని అన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తారని, అందువల్ల క్రమశిక్షణతో, ఓపికగా చదువుకోవాలని, మంచి పౌరులుగా ఎదగాలని, చదువుతోపాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాల్సిన అవసరం ఉందని అన్నారు.

