నవంబరు 07న 4వ జోన్ లో బహిరంగ వేలం నిర్వహణ.
– 4 వ జోనల్ కమిషనర్ ఎమ్ .మల్లయ్య నాయుడు.
*విశాఖపట్నం దివ్యదర్శిని న్యూస్*: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ 4వ జోన్ లో పలు వాణిజ్య సముదాయాల దుకాణాలకు, ఒక కళ్యాణ మండపం, ఒక మార్కెట్, జీవీఎంసీ మెయిన్ ఆఫీ కాంటీన్ నకు నవంబరు 07న తేది ఉ.గం.11.00 లకు బహిరంగ వేలం పాట నిర్వహించడం జరుగునని 4వ జోన్ జోనల్ కమిషనర్ ఎమ్.మల్లయ్య నాయుడు బుధవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
జివిఎంసి 4వ జోన్ (సూర్యబాగ్) పరిధిలో గల డైక్స్ ట్యాంక్ వాణిజ్య సముదాయము, జగదాంబ జంక్షన్ వద్ద వాణిజ్య సముదాయము, పాత బస్ స్టాండ్ దుకాణాములు, పద్మనగర్ వాణిజ్య సముదాయము, సూర్యబాగ్ వాణిజ్య సముదాయము, టి.ఎస్.ఆర్ కాంప్లెక్స్ వాణిజ్య సముదాయము, అంగడిదిబ్బ వాణిజ్య సముదాయము, జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని కాంటీన్, రెల్లి వీధిలోని అంబేద్కర్ కళ్యాణ మండపం, రెల్లివీధి రోడ్ సైడ్ ఫిష్ మార్కెట్లును 3 సంవత్సరముల కాల పరిమితికి గుత్తకు ఇచ్చేందుకు తేదీ 07-11- 2025 ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం పాట నిర్వహించబడునని జోనల్ కమిషనర్ తెలిపారు.
సదరు వేలంపాటలో పాల్గొనదలచిన వారు దరావత్తు సొమ్ము తదితర పూర్తి వివరాలకు 4వ జోనల్ కార్యాలయం పని వేళలో పర్యవేక్షకులను సంప్రదించగలరని జోనల్ కమిషనర్ తెలిపారు.


